హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: ప్రైవేట్ ఆస్పత్రులపై అధికారుల దాడులు.. అసలు నిజం తెలిసి షాకైన అధికారులు

Mulugu: ప్రైవేట్ ఆస్పత్రులపై అధికారుల దాడులు.. అసలు నిజం తెలిసి షాకైన అధికారులు

ములుగులో ప్రైవేట్ ఆస్పత్రుల సీజ్

ములుగులో ప్రైవేట్ ఆస్పత్రుల సీజ్

ములుగు (Mulugu) ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. దశాబ్ద కాలం వరకు ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం కూడా దిక్కులేని పరిస్థితి. ప్రాణాలు దక్కించుకోవాలంటే వరంగల్ (Warangal) లేదా హైదరాబాద్ (Hyderabad) లాంటి పెద్ద పెద్ద నగరాలకి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండేది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  Venu, News18, Mulugu

  ములుగు (Mulugu) ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. దశాబ్ద కాలం వరకు ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం కూడా దిక్కులేని పరిస్థితి. ప్రాణాలు దక్కించుకోవాలంటే వరంగల్ (Warangal) లేదా హైదరాబాద్ (Hyderabad) లాంటి పెద్ద పెద్ద నగరాలకి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ములుగు జిల్లా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ములుగు కేంద్రంగా అనేక ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వాటికి సరైన అనుమతులు ఉన్నాయా? లేవా? డాక్టర్లకు అర్హత ఉందా? లేదా? అనే విషయాలపై ఇక్కడి ప్రజలకు పెద్దగా అవగాహన లేదు. ప్రజలను ఆకర్షించడానికి పెద్దపెద్ద లైటింగ్ బోర్డ్స్ పెట్టి మెరుగైన వైద్యం పేరుతో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు.

  వైద్య ముసుగులో నడిచే మెడికల్ దందాకు అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య అధికారులను అలర్ట్ చేసింది. 'ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ 2020 చట్టం' ప్రకారం ప్రతి ఆసుపత్రి, ప్రతి క్లినిక్‌లో ఆసుపత్రికి సంబందించిన రిజిస్ట్రేషన్, అందులో పనిచేస్తున్న డాక్టర్ల అర్హత, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తదితర అంశాలను పరిశీలించాలని సూచించింది. అయితే చాలా వరకు ఆసుపత్రులు, వైద్యులు ఈ నిబంధనలు పాటించడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో నకిలీ ఆసుపత్రులు, వైద్యులు రోగులకు చికిత్స అందించడం వంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. ఈక్రమంలో ములుగు జిల్లా వైద్య అధికారి అప్పయ్య వైద్య బృందాలను ఏర్పాటు చేసి ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లను తనిఖీలు చేయడం మొదలుపెట్టారు.

  ఇది చదవండి: నోరూరించే చికెన్ సాంబర్ తినాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే.., వెరైటీ రుచులతో ఆకర్షిస్తున్న హోటల్

  మొదటి రోజే ములుగులో మూడు ఆసుపత్రులు సీజ్: ములుగు జిల్లా కేంద్రంగా నిర్వహిస్తున్న మూడు క్లినిక్‌లు 'క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2020' ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నిర్వహిస్తున్నందున, సీజ్ చేసినట్లు వైద్యాధికారి అప్పయ్య వెల్లడించారు. 1) గణపతి హెల్త్ కేర్ డెంటల్ హాస్పిటల్ మరియు మల్టీ స్పెషాలిటీ క్లినిక్, ములుగు, 2) వినయ్ క్లినిక్ డాక్టర్ సంతోష్ బిఎంఎస్, ములుగు, 3) పద్మాక్షి క్లినిక్, ములుగు, ఈ మూడు ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని తనిఖీలు చేసి అధికారులు సీజ్ చేశారు.

  మెరుపు దాడులు: ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేయడానికి జిల్లా వైద్య అధికారి మూడు బృందాలను ఏర్పాటు చేసి మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏకకాలంలో 13 ఆసుపత్రులను ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి. వాటిలో 12 ఆసుపత్రుల్లో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏటూర్ నాగారం, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు సీఈఏ 2020 ప్రకారం నియమనిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనే కోణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాక్టర్లకు సరైన వైద్య అర్హత ఉందా లేదా అనే కోణంలో కూడా వివరాలు సేకరిస్తున్నారు. నిబంధనకు విరుద్ధంగా ఆసుపత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య అధికారి అలెం అప్పయ్య హెచ్చరించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Mulugu, Telangana

  ఉత్తమ కథలు