హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. ప్రతి గ్రామంలోనూ స్పోర్ట్స్ కాంప్లెక్స్

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. ప్రతి గ్రామంలోనూ స్పోర్ట్స్ కాంప్లెక్స్

sports ground

sports ground

భూపాలపల్లి జిల్లా (Bhupalapalli District) లో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. క్రీడా ప్రాంగణానికి అనువైన స్థలాలను నెలాఖరు లోపు ఎంపిక పూర్తి చేయాలని కోరారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhupalpalle | Warangal | Telangana

Venu, News18, Mulugu

భూపాలపల్లి జిల్లా (Bhupalapalli District) లో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. క్రీడా ప్రాంగణానికి అనువైన స్థలాలను నెలాఖరు లోపు ఎంపిక పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనం ఉండేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధించిన అధికారులను ఆదేశించారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాల, అటవీ భూ సమస్యల తదితర అంశాలపై కలెక్టర్ గురువారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో ఉన్న 241 గ్రామపంచాయతీలలో 45 గ్రామాలలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సంబంధించి సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించి ఏర్పాటు దిశగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం నిర్మాణానికి అనువైన స్థలాలను నెలాఖరులోపు ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న 241 గ్రామపంచాయతీలు, 150 జనావాసాలకు గాను 320 ప్రాంతాల్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలాలను గుర్తించి, 169 క్రీడా ప్రాంగణాలు పూర్తి చేశామని అధికారులు వివరించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న క్రీడా ప్రాంగణాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, స్థలాల ఎంపిక నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఇది చదవండి: స్విమ్మింగ్ పూల్ లా ఉందని దిగితే అంతే సంగతులు..! మేడారం భక్తులకు అలర్ట్

మండలాల వారీగా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. జిల్లాలో అన్ని మండలాల్లో రేపు సాయంత్రం వరకు తాసిల్దారులు మండల పంచాయతీ అధికారులు, ఏపీవోలు, ఎంపీడీవోలు ఎంపిక చేసిన స్థలాల వివరాలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఎంపిక చేసిన స్థలాలను ఉపాధి హామీ కార్మికులను వినియోగిస్తూ గ్రౌండ్ లెవెలింగ్ పనులు పూర్తి చేయాలని, 31 జనవరి 2023 చివరి నాటికి 300 పైగా గ్రామీణ క్రీడా ప్రాంగణాలు గ్రౌండింగ్ పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో నిధుల సమస్యలు ఉన్న గ్రామపంచాయతీలలో మెటీరియల్ కాంపోనెంట్ కొనుగోలుకు కలెక్టరేట్ నుండి నిధులు మంజూరు చేస్తామని, ఉపాధి హామీ నిధులు వచ్చిన తర్వాత రియంబర్స్ చేయాల్సి ఉంటుందని, అవసరమైన గ్రామపంచాయతీలో నుంచి తీర్మానం, ప్రతిపాదనలు వెంటనే తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ దివాకర్, పిడిడిఆర్డిఓ పురుషోత్తం, జెడ్పిసిఈఓ రఘువరన్, తసీల్దార్ లు, ఎంపిడిఓలు, ఎంపిఓలు, ఏపిఓలు తదితరులు పాల్గొన్నారు.

First published:

Tags: Bhupalapally, Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు