హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: ప్రార్ధనకు వెళ్తున్న దంపతుల్ని వెంటాడిన మృత్యువు .. ఇద్దరు పిల్లల పరిస్థితి ఏమైందో తెలుసా

Mulugu: ప్రార్ధనకు వెళ్తున్న దంపతుల్ని వెంటాడిన మృత్యువు .. ఇద్దరు పిల్లల పరిస్థితి ఏమైందో తెలుసా

MULUGU ACCIDENT

MULUGU ACCIDENT

Mulugu: దైవ ప్రార్థన కోసమని వెళ్లిన దంపతులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. మృత్యువులా వచ్చిన లారీ తల్లిదండ్రులను ఒకేసారి బలి తీసుకోవడంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. ములుగు జిల్లా వాజేడు మండలం లింగంపేటకు చెందిన తోటపల్లి రమేష్, స్వరూప దంపతులు

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

(Venu Medipelly,News18,mulugu)

దైవ ప్రార్థన (Prayer)కోసమని వెళ్లిన దంపతులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. మృత్యువులా వచ్చిన లారీ(Lorry) తల్లిదండ్రులను ఒకేసారి బలి తీసుకోవడంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. ములుగు జిల్లా వాజేడు (Vajedu)మండలం లింగంపేటLingampetaకు చెందిన తోటపల్లి రమేష్(Thotapalli Ramesh), స్వరూప(Swarupa)దంపతులు...ప్రగల్లపల్లి చర్చి(Pragallapally Church)కి వెళ్లి ప్రార్థనలు చేస్తుంటారు. ప్రతి ఆదివారంలాగానే ఈ ఆదివారం(Sunday)కూడా ప్రార్థన కోసమని దంపతులిద్దరు తమ ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. కానీ మృత్యువు లారీ రూపంలో ఎదురొచ్చింది. రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చిన లారీ... ద్విచక్రవాహనంపై వస్తున్న వీరిని ఢీకొట్టింది. ఇద్దరు దంపతులు అక్కడికక్కడే మరణించారు.

Telangana : ముస్తాబైన నూతన కలెక్టరేట్‌ భవనం ..కేసీఆర్‌ చేతుల మీదుగా ఆగస్ట్ 5న ప్రారంభం


యాక్సిడెంట్‌తో అనాథలయ్యారు ..

వాజేడు మండల పరిధి సుందరయ్య కాలనీ సమీపంలో మద్యం సేవించిన లారీ డ్రైవర్ రాంగ్ రూట్లో అతివేగంగా లారీ నడుపుతు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. లారీ బలంగా ఢీకొట్టడంతో రెండు మృతదేహాలు జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా పడ్డాయి. రమేష్ మృతదేహం లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. అతని భార్య స్వరూప మృతదేహం చెట్టు కొమ్మల మధ్య ఇరుక్కుపోయింది. ఈ దృశ్యాలను చూసిన వ్యక్తులు గుండె కకావికలం అయింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రమేష్ స్వరూప దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో పిల్లలు అనాథలయ్యారు.

జేసీబీ విడిభాగాల వ్యాపారం పేరుతో వ్యక్తికి టోకరా:

జేసీబీ విడిభాగాలు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, వ్యాపారం ప్రారంభిస్తే లాభాలు వస్తాయంటూ నమ్మబలికి మోసం చేసిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత వివరాలు మేరకు... హన్మకొండకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి కొన్ని రోజుల క్రితం జేసీబీ సర్వీస్ నిర్వాహకుడు ఒకరు పరిచయం అయ్యాడు. జేసీబీ విడిభాగాలకు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని...పెట్టుబడి పెడితే లాభాలు ఉంటాయని నమ్మబలికాడు. దీంతో ఆ ఉద్యోగి తన వద్దనున్న క్రెడిట్ కార్డును సదరు జేసీబీ సర్వీస్ నిర్వాహకుడికి ఇచ్చాడు. దీంతో క్రెడిట్ కార్డు నుంచి రూ. 37 లక్షలు డ్రా చేసుకున్న నిర్వాహకుడు ఎంతకూ ఆ డబ్బు తిరిగి చెల్లించడం లేదు. దీంతో ఉద్యోగి హన్మకొండ పోలీసులను ఆశ్రయించాడు.

Published by:Siva Nanduri
First published:

Tags: Local News, Mulugu, Road accident

ఉత్తమ కథలు