హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్... కంప్యూటర్ కోడింగ్ ట్రైనింగ్.. !

Mulugu: గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్... కంప్యూటర్ కోడింగ్ ట్రైనింగ్.. !

coding training

coding training

విద్యార్థులకు కంప్యూటర్లు లేకుండా ప్రోగ్రాం విధానం ద్వారా కోడింగ్ లో శిక్షణ అందించేందుకు ముందుకు వచ్చిన ఇంటెల్, నెక్ట్స్ స్కిల్స్ 360,యూనైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్సంస్థల ప్రతినిధులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

రిపోర్టర్ : వేణు మేడిపెళ్లి

లొకేషన్ : భూపాలపల్లి

ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు నిరాకరించేవారు. అయితే, ఇది గతంలో మాటని చెప్పుకోవచ్చు. నేడు మాత్రం కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతుంది. విద్యార్థులతో అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతో పాటు కంప్యూటర్ విద్య , ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కోడింగ్ ప్రోగ్రాంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ కూడా అందించారు. జిల్లాలో ప్రభుత్వ పాటశాల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు అవసరమైన సాంకేతిక అదనపు నైపుణ్యాలు కల్పించేందుకు సంపూర్ణ కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా చెప్తున్నారు.

విద్యార్థులకు చదువుతో పాటు అదనపు నైపుణ్యాలు అందించేందుకు సిఎస్ఆర్ కింద హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు , దిశా ఫౌండేషన్ వంటి ఎన్జీవోల సహకారంతో పలు కార్యక్రమాలు అమలు చేశామని, ప్రస్తుతం విద్యార్థులకు కంప్యూటర్ లేకుండా కోడింగ్ అంశంలో పరిజ్ఞానం అందించేందుకు ఇంటెల్, నెక్ట్స్ స్కిల్స్ 360, యూనైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జిల్లాలోని 13 ప్రభుత్వ పాఠశాల పరిధిలో 2 వేల మంది విద్యార్థులకు కోడింగ్ అంశంపై శిక్షణ అందించామని కలెక్టర్ చెప్తున్నారు. గత సంవత్సరం జిల్లాలో 4 పాఠశాలల్లో కోడింగ్ అంశంపై శిక్షణ అందించామని,ప్రస్తుతం 13 ప్రభుత్వ పాఠశాలలో ఆన్లైన్ ద్వారా 80 నిమిషాల పాటు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. విజ్ఞాన రంగంలో గొప్ప పేరు సాధించిన రామానుజన్, కల్పనా చావ్లా మొదలైన అనేక మంది మహాత్ములు మారుమూలప్రాంతాల నుంచి వచ్చారని వారి స్ఫూర్తితోనే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి సాధన దిశగా కృషి ఉంటుంది.

వాటికి కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం తరఫున జిల్లా యంత్రాంగం విద్యార్థుల లక్ష్యాల సాధనకు సంపూర్ణ సహకారం అందించాల్సి ఉంటుంది. దేశంలో నిర్వహించే యు.పి.పి.ఎస్సి పరీక్షల్లో సైతం అనేక మారుమూల ప్రాంతాల విద్యార్థులు ప్రతి సంవత్సరం ఎంపిక అవుతున్నారు. విద్యార్థులు మార్కులపై కాకుండా విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవడంపై ఆసక్తి కనబడుచుకోవాల్సి ఉంటుంది.

దీనిలో భాగంగానే భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..విద్యార్థులకు కంప్యూటర్లు లేకుండా ప్రోగ్రాం విధానం ద్వారా కోడింగ్ లో శిక్షణ అందించేందుకు ముందుకు వచ్చిన ఇంటెల్, నెక్ట్స్ స్కిల్స్ 360,యూనైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్సంస్థల ప్రతినిధులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ శిక్షణ వల్ల కలిగిన ప్రయోజనాలపై డాక్యుమెంటరీ తయారు చేయాలని కలెక్టర్ కోరారు.భవిష్యత్తులో జిల్లాలో ఉన్న మిగిలిన పాఠశాలల్లో సైతం ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు అందించాలని, దానికి అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలు జిల్లా యంత్రాంగం తరుపున అందజేస్తామని కలెక్టర్ చెప్తున్నారు. నెక్స్ట్ స్కిల్స్ 360 కో ఫౌండర్ సౌజన్య మాట్లాడుతూ.. విద్యార్థులకు కంప్యూటర్లు లేకుండా కోడింగ్ పై శిక్షణ అందించేందుకు అవకాశం కల్పించాలని కలెక్టర్ ను కోరిన వెంటనే స్పందించి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లాలో ఆరో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి చదివే 2వేల విద్యార్థులకు కోడింగ్ పై శిక్షణ అందించామని, సాంకేతిక ప్రపంచంలో కోడింగ్ కీలక పాత్ర వహిస్తుందని, మనం వినియోగించే ప్రతి గ్యాడ్జెట్ పని తీరులో కోడింగ్ ఉంటుందని తెలిపారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని విద్యార్థులు చాలా చురుగ్గా ఉత్సాహవంతంగా కోడింగ్ శిక్షణలో పాల్గొన్నారని, విద్యార్థులు అంతా కలిసి మొత్తం 68690 ప్రోగ్రాం కోడింగ్ పాయింట్లు సాదించారని ఆమె తెలిపారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana schools, Warangal

ఉత్తమ కథలు