హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: లక్నవరం సరస్సు చూడటానికి వస్తున్నారా? ఇక్కడ తాటికల్లు రుచి చూడాల్సిందే

Mulugu: లక్నవరం సరస్సు చూడటానికి వస్తున్నారా? ఇక్కడ తాటికల్లు రుచి చూడాల్సిందే

X
మంచి

మంచి రుచికరమైన తాటికల్లు

Mulugu: గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలు తాటికల్లును దివ్య ఔషధంగా భావిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలు ఉదయం నుంచి వ్యవసాయ పనులు చేసి అలసిపోయిన అనంతరం పడుకునే ముందు తాటికళ్లను సేవించడం జరుగుతూ ఉండేది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Venu Medipelly, News18, mulugu

గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలు తాటికల్లును దివ్య ఔషధంగా భావిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలు ఉదయం నుంచి వ్యవసాయ పనులు చేసి అలసిపోయిన అనంతరం పడుకునే ముందు తాటికళ్లను సేవించడం జరుగుతూ ఉండేది. ఆ రోజుల్లో బార్ షాప్ లో రెస్టారెంట్లు వారికి తెలియదు పాపం తెలిసిందల్లా ఒక్కటే స్థానికంగా ఉండే గౌడన్నతో ఉదయం సాయంత్రం ఒక సీసా కళ్ళు బొట్టు తాగితే వచ్చే ఆనందమే వేరు.బయటి మార్కెట్లో వైన్ షాపులలో ఒక ఖరీదైన ఫుల్ బాటిల్ ధర వేల రూపాయలు ఉంటుంది. కానీ ఒక సీసా కళ్ళు బాటిల్ కేవలం 100 రూపాయలు మాత్రమే. ఒక మాటలో చెప్పాలంటే దేవతలు సేవించిన సురా పానకం తాటికల్లుగా చెప్పుకుంటారు..... ఇంత చరిత్ర ఉన్న తాటికల్లును మీరు తాగాలంటే బుస్సాపూర్ గ్రామానికి రావాల్సిందే.

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామం తాటికల్లుకు ఎంతో ఫేమస్. చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు తాటికల్లు కోసమే బుస్సాపూర్ గ్రామానికి వస్తూ ఉంటారు. లక్నవరం సరస్సు ఈ గ్రామం గుండానే వెళ్లాలి. సరస్సుకు వచ్చే పర్యాటకులు తాటికల్లు సేవిస్తూ మధురానుభూతిని పొందుతుంటారు. ఉరుకుల పరుగుల జీవనంలో గడిపే నగరవాసులకు స్వచ్ఛమైన తాటికల్లు దొరకడం చాలా కష్టం.

ఇలాంటి పర్యాటక ప్రాంతాలకు వచ్చినప్పుడే ప్రత్యేకంగా వీటిని సేవిస్తూ ఉంటారు....సెలవు రోజులలో బుస్సాపూర్ గ్రామానికి చెందిన గౌడ్ అన్నలు పాల లాంటి స్వచ్ఛమైన కళ్ళు తాటి చెట్లను తీసి పర్యాటకుల కోసం సిద్ధంగా ఉంచుతారు. ఒక బాటిల్ ధర 150 నుంచి 200 మధ్యలో ఉంటుంది. వేల రూపాయలు పోసి ఆల్కహాల్ కొనుక్కునే బదులు తక్కువ ధరలో ఆరోగ్యానికి మంచిదైన తాటికల్లు సేవించడం ఎంతో మంచిది.

తాటికల్లులో ఎన్నో దివ్య ఔషధ గుణాలు.

పూర్వకాలంలో తాటి చెట్లని కల్పవృక్షంగా చెప్పుకునేవారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే కిడ్నీలలో రాళ్ల సమస్య వస్తే దానికి ఒకే ఒక పరిష్కారం తాటికల్లు మాత్రమే. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ తాటికల్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది..... తాటికల్లులో క్యాన్సర్ని సైతం నయం చేసే లక్షణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా తెలిపారు. తాటికల్లు టైఫాయిడ్ వంటి వ్యాధులకు కూడా ఈ యాంటీబయటిక్ గా పనిచేస్తుంది అని వైద్యులు చెప్తున్నారు.

బుస్సాపూర్ గ్రామం తాటికల్లు ఫేమస్....

లక్నవరం సరస్సు ప్రాచుర్యంలోకి రాకముందే బుస్సాపూర్ గ్రామం తాటికల్లుకు ఎంతో ఫేమస్ ములుగు జిల్లా వ్యాప్తంగా బుస్సాపూర్ గ్రామానికి కేవలం తాటికల్లు కోసం మాత్రమే ప్రజలు వస్తూ ఉండేవారు. ఒకప్పుడు వందల సంఖ్యలో తాటి చెట్లు ఉండేవి గౌడ్ అన్నలు కూడా వాటిపై ఆధారపడి జీవనం కొనసాగించేది. కానీ కాలక్రమేనా తాటి చెట్లు కొన్ని కారణాలవల్ల చెట్లు నశించిపోయాయి. వీటి పైన ఆధారపడ్డ గౌడ్ అన్నలు ఉపాధి లేకపోవడంతో కూలీ పనులకు వెళ్తున్నారు.

Hyderabad: చలికాలంలో తగ్గుతున్న పగటి సమయం.. గంట పెరిగిన రాత్రి సమయం

ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడి గౌడ్ అన్న దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తాటి చెట్లను పంపిణీ చేయాలని గౌడన్నలకు కనీసం పెన్షన్ సౌకర్యమైనా కల్పించాలని బుస్సాపూర్ గౌడన్నలు ఆవేదన చెందుతున్నారు. లక్నవరం వచ్చే పర్యాటకులు తాటికల్లు కావాలంటేఈ క్రింది నెంబర్ను సంప్రదించవచ్చు9502626451. రాజు గౌడ్ బస్సాపుర్ గ్రామం.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు