హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: సీఎం సారు మీరైనా పట్టించుకోండి.. ఏజెన్సీలో ఆదివాసీల నిరసన

Mulugu: సీఎం సారు మీరైనా పట్టించుకోండి.. ఏజెన్సీలో ఆదివాసీల నిరసన

X
బాధపడుతున్న

బాధపడుతున్న ఆదివాసీ ప్రజలు

Mulugu: 40 రోజుల నుంచి న్యాయం కోసం అలుపెరుగని పోరాటం.. ఆదివాసీలకు అన్యాయం జరిగిందంటే ఏ ఒక్క అధికారి ఎందుకు స్పందించడం లేదు. జరిగిన అక్రమాల వెనుక ఎవరెవరు ఉన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Venu Medipelly, News18, mulugu

40 రోజుల నుంచి న్యాయం కోసం అలుపెరుగని పోరాటం.. ఆదివాసీలకు అన్యాయం జరిగిందంటే ఏ ఒక్క అధికారి ఎందుకు స్పందించడం లేదు. జరిగిన అక్రమాల వెనుక ఎవరెవరు ఉన్నారు. అయ్యా సీఎం సారు మీరైనా మా బాధను పట్టించుకోండి. ఆదివాసి ప్రాంతంలో ఆదివాసి చట్టాలకు అధికారులు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. మాకు మీరే న్యాయం చేయాలి. ప్రగతి భవన్ దిశగా పాదయాత్ర చేపట్టిన ఆదివాసీ నాయకులు

ఐటీడీఏ ఏటూర్ నాగారం ఆదివాసి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఆదివాసీల అభ్యున్నతికి, ఆదివాసీల ఎదుగుదల కోసం కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పుకోవచ్చు. కానీ ఇదే సంస్థలో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని ఆదివాసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిగా ఉద్యోగాలు ఏజెన్సీ అభ్యర్థులకు మాత్రమే దక్కాలని ప్రభుత్వం అనేక చట్టాలు రూపొందించినప్పటికీ అధికారులు మాత్రం వాటిని తుంగలో తొక్కుతున్నారని, ఆదివాసి చట్టాలకు విరుద్ధంగా గిరిజనేతరులకు ఉద్యోగాలు ఎలా కల్పిస్తున్నారని ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు అధికారులపై మండిపడుతున్నారు. చట్టాలకు విరుద్ధంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతలకు ఉద్యోగాలు ఎలా కల్పిస్తున్నారని, ఉద్యోగాలు ఇచ్చిన వారందరినీ వెంటనే విధుల నుంచి తొలగించాలని, వారి స్థానంలో ఏజెన్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలని వీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఐటిడిఏ టూర్ నాగారం కార్యాలయం సాక్షిగా 40 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ఏ ఒక్క అధికారి స్పందించడం లేదని ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ అంకిత్ ఐఏఎస్ కూడా వినతి పత్రం అందించినా.. ఇప్పటివరకు ఏ విధంగా స్పందించడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికంగా ఉండే జిల్లా కలెక్టర్ డిఎం అండ్ హెచ్ ఓ అందరు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ అక్రమాల విషయంలో ఎవరు నోరు మెదపడం లేదని, ఈ అక్రమ నియామకాల వెనుక జిల్లా స్థాయి అధికారుల హస్తం ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో విసిగివేసారిన ఆదివాసి నాయకులు ఏటూరు నాగారం కేంద్రం నుంచి ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేపడుతూ తమ సమస్యలను ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్తామని పాదయాత్ర చేపట్టారు.

ఆదివాసి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో ప్రత్యేకమైన చట్టాలను ప్రత్యేకమైన జీఓలను తీసుకువచ్చినప్పటికీ వాటిని పాటించడంలో అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ నేపథ్యంలోనే గిరిజన ఇతరులకు కూడా అక్రమంగా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు దీనిపై వెంటనే అధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతలను విధుల నుంచి తొలగించాలని మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

వీరు శాంతియుతంగా నిరసనలు చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం నాయకులను ఎక్కడికి అక్కడ నిర్బంధిస్తూ అరెస్టు చేస్తున్నారని ఆదివాసి నాయకులు మండిపడుతున్నారు. వారి సమస్యను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లే క్రమంలో కేంద్రం నుంచి పాదయాత్రగా బయలుదేరిన ఆదివాసి సంఖ్య పెరుగుతుంది. నాయకులను పోలీసులు చిన్నబోయినపల్లి గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివాసి నాయకులు మాట్లాడుతూ.. గిరిజన అభ్యర్థులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు.

ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ఇతరులకు ఏ విధంగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఆదివాసి చట్టాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు.. వీటన్నిటిపై అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమంగా నియమించిన గిరిజనేతలను విధుల నుంచి తొలగించి వారి స్థానంలో గిరిజనులకు ఉద్యోగాలు కల్పించాలని వారు కోరుతున్నారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు