Venu, News18, Mulugu
ములుగు జిల్లా (Mulugu district) ఏజెన్సీ ప్రాంతంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కేంద్ర సహాయ మంత్రి బిఎల్ వర్మ (Central Minister of states BL Verma) పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో ములుగు నియోజకవర్గంలో బిజెపి (BJP) జెండా ఎగురు వేయడమే లక్ష్యంగా బిజెపి నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ములుగు జిల్లాకు కేంద్ర ఈశాన్య రాష్ట్రాల సహాయం మంత్రి బిఎల్ వర్మ పర్యటించడం ఇందుకు సంకేతంగా తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ లోక్ సభ ప్రవాస్ యోజన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమ్మేళన కార్యక్రమాన్ని గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి సహకార శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి బీఎల్ వర్మ మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రవేశపెడుతుందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు కాకుండా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుపడుతుందని ఆరోపించారు. కరోనా వచ్చిన సమయంలో కేంద్రం లాక్ డౌన్ ప్రకటించి ఆ సమయంలో ప్రజలందరికీ మాస్కులు, శానిటైజర్, వ్యాక్సిన్ పంపిణీ చేసి ప్రజల ప్రాణాలను కాపాడారని చెప్పారు. ప్రజల ప్రాణమే ముఖ్య ఉద్దేశంగా ఉచిత రేషన్ నెలలుగా ఇస్తున్నారని.. పిఎం కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం ఒక్కో లబ్ధిదారునికి 6000 చొప్పున ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
మహిళలు ఇబ్బంది పడకూడదని గరీబ్ వాళ్లకి ఉచిత గ్యాస్ సిలిండర్ లను పంపిణీ, దేశంలోని40 కోట్ల మందికి జీరో అకౌంట్లనుఅందించారని.. ఏ లబ్ధిదారుడికైనా డైరెక్ట్ గా వారి వారి అకౌంట్లోనే డబ్బులు పడడానికి అనుకూలంగా ప్రధానమంత్రి అవకాశం కల్పించారని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నామని, ఫసల్ బీమా యోజనను పంట నష్టపోయిన రైతులకు ఇప్పిస్తున్నామని.. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి విరుద్ధంగా పనిచేస్తుందని ఆరోపించారు.
అనంతరం సహాయ మంత్రి బిఎల్ శర్మ తాడ్వాయి మండల కేంద్రంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల వంటగది పరిసర ప్రాంతాలను పరిశీలించి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే విద్యార్థులు అనారోగ్యానికి గురవుతారనిఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Local News, Mulugu, Telangana