Venu, News18, Mulugu
వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు పర్యాటకులు అందమైన పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం.. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయడం తరచూ మనం చూస్తూనే ఉంటాం. చాలామంది వింటర్ సీజన్ రాగానే వెళుతూ ఉంటారు. తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని పర్యాటక రంగానికి లక్నవరం సరస్సు (Laknavaram Lake) కలిగితు రాయిగా మనం చెప్పుకోవచ్చు. అందుకే ఈ లక్నవరం సరస్సు సందర్శించడం కోసం రాష్ట్రం నుంచి కాకుండా ఇతర సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు సందర్శిస్తూ ఉంటున్నారు. లక్నవరం సరస్సు పర్యాటకులతో నిండిపోతుంది జనసంద్రంగా మారిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ చాలామంది ప్రకృతి ప్రేమికులు లక్నవరం సరస్సుకే ఎందుకు వస్తారంటే లక్నవరంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
మొదటగా మనం చెప్పుకోవాల్సింది ఉయ్యాల వంతెన. ఈ వంతెన పైనుంచి నడుస్తుంటే వంతెన ఊగుతున్నట్టు ఉంది. కింద సరస్సు పైన ఆకాశం మధ్యలో పంపిన ఆ మధురానుభూతి వేరే లెవెల్ లో ఉంటుంది. స్పీడ్ బోటింగ్ సర్వసాధారణంగా మనం సినిమాలలో చూస్తూ ఉంటాం. హైదరాబాద్ (Hyderabad) లాంటి మహా నగరాల్లోహుస్సేన్ సాగర్ తీరంలో స్పీడ్ బోటింగ్ అందరూ చేస్తూ ఉంటారు. కానీ లక్నవరం సరస్సులో స్పీడ్ బోటింగ్ చేస్తే ఆ కిక్కు వేరే లెవల్ లో ఉంటుంది.
చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం సరస్సు మధ్యలో కొండలు కొండల చుట్టూ స్పీడ్ బోర్డుతో ఒక చుట్టు చుట్టేస్తే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది. దానికోసమే తెలంగాణ పర్యాటక శాఖ లక్నవరం సరస్సుకు మరో రెండు అదనపు స్పీడ్ బోట్లను కూడా కేటాయించడం విశేషం. ఎందుకంటే ఇక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది చాలామంది స్పీడ్ బోటునే ఇష్టపడుతూ ఉంటారు. లక్నవరంలో దొరికే ఆ థ్రిల్లింగ్ మరెక్కడా దొరకదు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పర్యాటక ప్రాంతం నుంచి రానంత ఆదాయం కేవలం లక్నవరం నుంచే పర్యాటక రంగానికి అందుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు లక్నవరంలో ఎంతమంది స్పీడ్ బోటింగ్ ఇష్టపడుతున్నారు అనేది. ఓవరాల్ లక్నవరం యూనిట్ నుంచి వీకెండ్ రోజులలో ఒక రోజుకు లక్ష రూపాయలకు పైగా ఆదాయం వస్తుందంటే అది మామూలు విషయం కాదు.
తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ఆదాయం వచ్చే పర్యాటక ప్రాంతంగా లక్నవరం సరస్సు ముందు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు లక్నవరం వచ్చేయండి. స్పీడ్ బోట్మధురానుభూతిని పొందండి. అంతేకాకుండా లక్నవరం వచ్చే పర్యాటకుల కోసం రెస్టారెంట్, కాటేజీలు, ఐలాండ్ మధ్యలో కాటేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. 8143095885 నంబర్స్ ను కాంటాక్ట్ చేస్తే కాటేజీలు పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana