హోమ్ /వార్తలు /తెలంగాణ /

గిరిజన చిన్నారుల కోసం దట్టమైన అడవి బాట పట్టిన బైక్ రైడర్స్.. ఎందుకో తెలుసా?..

గిరిజన చిన్నారుల కోసం దట్టమైన అడవి బాట పట్టిన బైక్ రైడర్స్.. ఎందుకో తెలుసా?..

X
గొప్పమనసు

గొప్పమనసు చాటుకున్న బైక్ రైడర్స్

Telangana: వారందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. కానీ ఖాళీ సమయం దొరికిందంటే చాలు వారి హాబీ మాత్రం బైక్ రైడ్ చేయాల్సిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

వారందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. కానీ ఖాళీ సమయం దొరికిందంటే చాలు వారి హాబీ మాత్రం బైక్ రైడ్ చేయాల్సిందే. వారికంటూ కిర్రాక్ రైడర్స్ అనే గ్రూప్ కూడా ఉంది. కానీ ఈ కిర్రాక్ రైడర్స్ ఏటూర్ నాగారం దట్టమైన అటవీ ప్రాంతంలోకి వచ్చారు. సుమారు 350 కిలోమీటర్లు, 20 మంది యువతీ యువకులు, అత్యంత ఖరీదు చేసే ద్విచక్ర వాహనాలు,లక్షల రూపాయల ఖర్చు. మరి అంత దూరం నుంచి ఏటూరు నాగారం ఐలాపూర్ దట్టమైన అటవీ ప్రాంతానికి రావలసిన అవసరం ఏముంది? అటవీ ప్రాంతంలో వారు ఏం చేశారు?

కిర్రాక్ రైడర్స్ గ్రూప్ పై న్యూస్ 18 ప్రత్యేక కథనం..

న్యూస్ 18 గిరిజనుల జీవన విధానాలను బయట ప్రపంచానికి తెలియజేయడంలో ప్రత్యేక కథనాలను ప్రజల ముందుకు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే న్యూస్ 18 ఐలాపూర్ గ్రామంలో సమస్యల గురించి అధ్యయనం చేస్తుంది. ఇంతలోనే ఐలాపూర్ గ్రామస్తులు ఇక్కడ షూటింగ్ ఏమైనా జరుగుతుందా సార్ చాలామంది ఖరీదైన బైక్ లతో యువతి యువకులు ఘట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లారని న్యూస్ 18 ప్రతినిధికి సమాచారం ఇచ్చారు.

అసలు విషయం తెలుసుకుందామని న్యూస్ 18 బైక్ రైడర్స్ ను వెతుక్కుంటూ ఐలాపూర్ దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లగా.. దాదాపు 20 మంది ఖరీదైన ద్విచక్ర వాహనాలతో హైదరాబాద్ నుంచి వచ్చిన యువతి యువకులు కనిపించారు. ఐలాపూర్ సమ్మక్క దేవాలయం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే..

ఏటూరు నాగారం దట్టమైన అటవీ ప్రాంతంలో అనేక గుత్తి కోయ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలలోని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడం కోసం భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ ముందుకు వచ్చి పాఠశాలలు ఏర్పాటు చేసి టీచర్లను నియమించి గిరిజన చిన్నారులకు అక్షరాలను నేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సదరు ఉపాధ్యాయురాలు ఒక పిల్లవాడిని జీవితంలో నీ లక్ష్యం ఏమిటని అడిగింది. నువ్వు పెద్దవాడివి అయ్యాక ఏం అవుతావు అని అడిగింది. గిరిజన చిన్నారులు చెప్పిన సమాధానం విని ఉపాధ్యాయురాలు ఆశ్చర్యానికి గురైంది.

ఒక విద్యార్థి నేను అంగన్వాడి టీచర్ను అవుతానని సమాధానం చెప్పింది మరో విద్యార్థిని నేను ఆశా వర్కర్ ని అవుతాను అని సమాధానం చెప్పింది. అంటే గిరిజన చిన్నారులు నిత్యం ఎవరిని పరిశీలిస్తూ ఉంటారో వారిని అనుకరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ నిర్వాహకులు ఇక్కడున్న పిల్లలకి బయట ప్రపంచాన్ని తెలియజేయాలి అనుకున్నారు. వారి ఆలోచనలు కూడా గొప్పగా ఉండాలని అనుకున్నారు. వెంటనే భీమ్ చిల్డ్రన్స్ హ్యాపీనెస్ సెంటర్ నిర్వాహకులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ బైక్ రైడింగ్ చేస్తున్న కిర్రాక్ రైడర్స్ వారిని సంప్రదించారు.

ఒకరోజు మా అటవీ ప్రాంతానికి వచ్చి ఇక్కడున్న చిన్నారులతో మాట్లాడాలి.. అవగాహన పెరిగే విధంగా ఒక ప్రయత్నం చేయాలని కోరారు. వెంటనే ఓకే అన్న కిరాక్ బైక్ రైడర్స్ హైదరాబాద్ నుంచి దట్టమైన అటవీ ప్రాంతానికి వచ్చారు.

మనదేశంలో ఇప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే నిజంగా మేము నమ్మలేకపోతున్నామని, ఇక్కడికి రావాలంటే సుమారు మూడు వాగులను దాటుకుంటూ ఎన్నో వ్యయప్రయాసలను ఎదుర్కొని వచ్చామని.. అలాంటిది నిరంతరం వీరు ఇంత దట్టమైన అటవీ ప్రాంతంలో ఎలా జీవిస్తున్నారని ఇప్పటికీ మేము షాక్ అవుతున్నామని చెప్పారు. వీరికి ప్రత్యేక ఏర్పాట్లు, సదుపాయాలు అందించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందని.. రాబోయే రోజుల్లో మరింత సహాయం అందించడం కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు