పార్సిల్స్, కారులు, బైకులు, టిఫిన్ బాక్సుల్లో బాంబులు పెట్టడం.. పేల్చడం మనం ఇంతవరకు చూశాం. తాజాగా బీర్ బాటిల్‌లో బాంబు కలకలం రేపింది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో బీర్ బాటిల్ లో బాంబ్ పెట్టడం సంచలనంగా మారింది. ఈ ఘటన జిల్లాలోని వెంకటాపురం మండలం పామునూరులో చోటు చేసుకుంది. పోలీసులు టార్గెట్ గా మావోయిస్టులు అమర్చారు.
ఆ మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. బీరు బాటిల్, వైర్లు, బోల్టులు స్వాధీనం చేసుకున్నారు. ములుగు అడవిలో కూబింగ్ నిర్వహించే పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేయాలని నిర్ణయించారు. దీని కోసం కొత్తతరహాగా ఈరకం మందుపాతలను ఏర్పాటు చేశారు. వెంకటాపురం పామనూర్ అడవిలో బీర్ బాటిల్ లో ఐఈడీ లను అమర్చి మందుపాతరను ఏర్పాటు చేశారు. ఈ తరహా మందుపాతరలను చూసి పోలీసులు షాక్ అయ్యారు.
దీంతో వెంటనే స్పెష ల్ పార్టీ, సీఆర్సీఎఫ్ బెటాలియన్ పోలీసులు ములుగు ఫారెస్ట్‌లో కూబింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే, బీర్ బాటిల్ మందుపాతరలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడంతో పెనుప్రమాదం నుండి పోలీసులు బయటపడ్డారు. దీనిపై మావో అగ్రనేతలపై వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Maoist, Maoist attack, Warangal, WARANGAL DISTRICT