(Venu Medipelly,News18,mulugu)
పల్లెటూరు ప్రాంతాలలో చాలామంది నాటు కోళ్లను పెంచుకుంటారు. కానీ వాటి ద్వారా రైతులకు ఆశించిన లాభాలు దక్కడం లేదు. రైతులు ఆర్థికంగా ఎదగడం కోసం గ్రామాలలోని మహిళలకు చిన్న పిల్లలకు గర్భిణీలకు పౌష్టికాహారం అందించడం కోసం, అలాగే రైతులకు మంచి లాభాలు రావడం కోసం పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం(PV Narasimha Rao Veterinary University) వారు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పెరటి కోళ్ల పెంపకానికి అనుకూలంగా ఉండే జాతి కోళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నాయి. ములుగు(Mulugu)జిల్లాకు చెందిన పశు వైద్య అధికారులు వాటిపై అవగాహన కల్పిస్తున్నారు.
ఈ కోళ్లను పెంచడం వల్ల లాభాలేంటి..?
పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం వారు అందించే దేశీ కోళ్లను పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన పోషకాలు అందడంతో పాటు మార్కెట్లో క్రయవిక్రయాలు జరిపితే అధిక లాభం వచ్చే అవకాశం ఉంటుంది. మేలు రకం కోళ్లను పెంచుకోవడం ద్వారా తక్కువ కాలంలోనే ఎదుగుదల గుడ్ల ఉత్పత్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. దీని ద్వారా మాంసపు ఉత్పత్తి గుడ్ల ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో రైతులకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
అవగాహన ..
ములుగు జిల్లా జిల్లా పశు వైద్య అధికారి విజయభాస్కర్ ఆధ్వర్యంలో పెరటి కోళ్ల పెంపకంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతూ ప్రజలలో చైతన్యం తీసుకొస్తున్నారు. పెరటి కోళ్ల పెంపకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా పౌష్టిక ఆహారం అందుతుందని చిన్నపిల్లలకు వీటి గుడ్లను పెట్టడం ద్వారా అధిక పోషకాలు అందుతాయని అధికారులు చెప్తున్నారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి...?
మేలు రకం కోళ్ల పెంపకం కోసం ఆసక్తి గల రైతులుములుగు జిల్లా పశు వైద్య కేంద్రాలలో సంప్రదించాలి. ఆసక్తిగల అభ్యర్థులు 600 రూపాయలను జిల్లా పశు వైద్య అధికారి పేరున డీడీ తీయాల.. డీడీలు సమర్పించిన వారికి గ్రామీణ ప్రాంతాలలో గ్రామసభలలో తీర్మానం చేసుకోవాలి. లబ్ధిదారులను ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుంది.... ప్రభుత్వం నుంచి 1250 రూపాయల సబ్సిడీ అందించడం జరుగుతుంది. రైతు ఆధార్ కార్డ్ బ్యాంకు డిడి గ్రామసభ తీర్మానం దరఖాస్తుకు జత చేసి డిసెంబర్ 10వ తారీఖు లోపు జిల్లా పశు వైద్య కార్యాలయంలో సమర్పించాలి. ములుగు జిల్లాలో మొత్తం తొమ్మిది మండలాలకు కలిపి 175 యూనిట్లు మంజూరు చేసినట్లు దానికి గాను 2.18 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో కేటాయించిందని ఒక్కో మండలానికి 19 యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఒక యూనిట్ లో 25 కోడి పిల్లలు ఉంటాయి. వీటికి ప్రభుత్వం కేటాయించిన ఒక యూనిట్ విలువ 1850 కాగా లబ్ధిదారులు మాత్రం 600 రూపాయలు డిడి చెల్లిస్తే మిగతా డబ్బులు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది
ఏ కోళ్లను పంపిణీ చేస్తారు...?
దరఖాస్తు చేసుకున్న రైతులకు పెరటి కోళ్ల పంపకానికి మూడు రకాల మేలురకం జాతి కోడి పిల్లలను పంపిణీ చేయనున్నది. సాధారణంగా పెరటి కోళ్లు 60 నుంచి 70 మధ్యలో గుడ్లు ఉత్పత్తి చేస్తాయి. వాటి ఎదుగుదల కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది. కానీ పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పంపిణీ చేసే మేలు రకం జాతి కోడి పిల్లలు తక్కువ కాలంలో ఎక్కువ ఎదుగుదల గుడ్ల ఉత్పత్తి కూడా నూట ముప్పై నుంచి నూట అరవై వరకు ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు మీరు పంపిణీ చేసే మేలైన కోడి పిల్లలు రాజశ్రీ, గిరిరాజా, వనరాజాకోడి పిల్లలను సిద్ధం చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకొని కోడి పిల్లలను పొందాలని అధికారులు చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana News