హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: వినాయకుడు చెప్పాడంటూ ఈ గ్రామస్థులు ఏం చేశారో తెలుసా..?

Mulugu: వినాయకుడు చెప్పాడంటూ ఈ గ్రామస్థులు ఏం చేశారో తెలుసా..?

ములుగు

ములుగు జిల్లాలో వింత సాంప్రదాయం

తొమ్మిది రోజుల పాటు గణేశుడికి పూజలు నిర్వహించి చివరి రోజున నిమజ్జన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక మహిళ చెప్పిన విషయంతో ఆ ఊరిలో సంబరాలు ఒక రోజు ఎక్కువగా జరిగాయి. ములుగు జిల్లా(Mulugu District) తాడ్వాయి మండలం దామరవాయి గ్రామంలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  Venu, News18, Mulugu

  దేశ వ్యాప్తంగా వినాయక చవితి (Vinayaka Chavithi) నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా భక్తులు నిర్వహించుకున్నారు. వినాయక మండపాల అలంకరణ నుంచి అన్నదానాలు, పూజలు, నైవేద్యం... ఇలా తొమ్మిది రోజుల పాటు అందరూ ఉత్సాహంగా వేడుకలు నిర్వహించుకుని అనంతరం గంగా నిమజ్జనంతో ముగింపు పలికారు. చిన్న గ్రామాలలో సైతం పిల్లలు పెద్దలు సంతోషాలతో వినాయక చవితి నిర్వహించుకుంటారు. అందరిలానే ఆ ఊరి గ్రామస్తులు సైతం వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు గణేశుడికి పూజలు నిర్వహించి చివరి రోజున నిమజ్జన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక మహిళ చెప్పిన విషయంతో ఆ ఊరిలో సంబరాలు ఒక రోజు ఎక్కువగా జరిగాయి. ములుగు జిల్లా(Mulugu District) తాడ్వాయి మండలం దామరవాయి గ్రామంలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది.

  తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా అత్యంత భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించిన గ్రామస్థులు నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకున్నారు. చివరి రోజు పూజలో భాగంగా గ్రామస్తులందరూ కలిసి వేడుకలో పాల్గొన్నారు. కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. వినాయక విగ్రహాన్ని కదిలించేలోపే అక్కడే ఉన్న ఓ మహిళకు ఒక్కసారిగా పూనకం లేచింది. తెలియని శక్తి ఆమెపై కూర్చుందని గ్రామస్థులు చెప్పారు. సాధారణంగా బోనాల సమయంలో రంగం సమయంలో మహిళలకు పూనకం వచ్చి భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా వినాయక ఉత్సవాల సమయంలో మహిళకు పూనకం రావడంతో గ్రామస్థులు కొంత ఆశ్చర్య పోయారు. ఊరికి కీడు వచ్చిందని, గ్రామస్తులంతా ఉదయం తెల్లవారక ముందే లేచి వెళ్లి ఊరు బయట వన భోజనాలకు వెళ్లాలని పూనకం వచ్చిన మహిళ చెప్పింది.

  ఇది చదవండి: తెలంగాణలో దొంగల రాజ్యంగా చరిత్రలో నిలిచిన లింగాల.. ఆ ఊరి కథేంటి..?

  అంతా సక్రమంగానే నిర్వహించినా ఆ గ్రామానికి కీడు ఎలా వచ్చిందో మాత్రం ప్రజలకు అర్థం కాలేదు. పూనకం వచ్చిన మహిళ మాత్రం వనభోజనాలకు వెళ్లాల్సిందే అని చెప్పడంతో గ్రామస్తులందరూ సూర్యుడు ఉదయించడమే ఆలస్యం తట్టా బుట్టా, కోడి పిల్ల, గంజులు కల్లు శాఖ, మందు శాఖ అన్ని పట్టుకుని ఊరు బయటకి వనభోజనాలకు వెళ్లారు. రోజురోజుకీ అభివృద్ధి పేరుతో దూసుకుపోతున్న నేటి ప్రపంచంలో ఇలాంటివి నమ్మడం చాలా వింతగా అనిపించినప్పటికీ కొన్ని కొన్ని గ్రామాలలో మాత్రం ఇవే ఆనవాయితీగా వస్తున్నాయి.

  ఇది చదవండి: ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఆదరణ మరిచింది.. ప్రభుత్వ బీమా కోసం మత్స్యకారుల నిరీక్షణ

  నిజానికి ఆ గ్రామానికి కీడు వచ్చిందో లేదో తెలీదుగానీ ఒక్కరోజు ఊరంతా కలిసి వనభోజనాలకు వెళ్లి అందరూ కలిసి సామూహికంగా వంటలు చేసుకుని భోజనాలు చేసి అనంతరం మానసిక ఉల్లాసం కోసం ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ రోజంతా గడపడం చాలా సంతోషంగా ఉందని గ్రస్దానికులు చెబుతున్నారు.

  ఇలాంటి వాతావరణం మాత్రం కచ్చితంగా పల్లెటూరికి మాత్రమే సొంతమని మనం చెప్పుకోవచ్చు. పట్టణ ప్రాంతాలలో నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో పక్కింటి వ్యక్తితో మాట్లాడటానికి కూడా వీలు లేకుండా ఉన్న ఈ రోజుల్లో అందరూ కలిసి ఇలా సామూహిక వన భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంటుందని గ్రామస్తులు చెప్తున్నారు. మహిళలు పాటలు పాడుతూ.... మగవారు మందేసి చిందేస్తూ.. యువకులు ఆటలాడుతూ ఒకరోజు మొత్తం ప్రజలు కలిసిమెలిసిపోయారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Mulugu, Telangana

  ఉత్తమ కథలు