హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్ట్.. బిక్కుబిక్కుమంటున్న ఏజెన్సీ

Mulugu: మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్ట్.. బిక్కుబిక్కుమంటున్న ఏజెన్సీ

X
భయంతో

భయంతో వణికిపోతున్న ఏజెన్సీ ప్రజలు

Mulugu: మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఐదుగురు మావోయిస్టు మిలీషియాసభ్యులను ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలో డిసెంబర్ 2 నుంచి మావోయిస్టుల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రం కలకలం సృష్టించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Venu Medipelly, News18, mulugu

మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఐదుగురు మావోయిస్టు మిలీషియాసభ్యులను

ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలో డిసెంబర్ 2 నుంచి మావోయిస్టుల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రం కలకలం సృష్టించింది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మావోయిస్టు మిలీషియాసభ్యుల అరెస్టు ఘటన ములుగు జిల్లా వ్యాప్తంగా సంచలన సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలోనే చతిస్ ఘడ్ అటవీ ప్రాంతంలో తుపాకుల మోత మొదలై భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. అటువైపుగా వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసు వారిని చూసి అనుమానాస్పదంగా పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంటనే పట్టుకొని వారి వద్ద తనిఖీ చేశారు. వారి వద్ద నుంచి పోలీసులు మావోయిస్టులకు సంబంధించిన కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

పెంక వాగుకు చెందిన సోడి నరసింహారావు, సోడి లక్ష్మయ్య, సోడి కాంతమ్మ, మాడే సూరిబాబు, బోడిక రంజిత్ లుగా గుర్తించారు. ఈ ఐదుగురు సభ్యులు చతిస్ ఘడ్ అటవీ ప్రాంతానికి వెళ్లి వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ ఇతర అగ్ర నాయకులను కలిశారు. డిసెంబర్ రెండో తారీఖు నుంచి మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా వాటికి సంబంధించిన కరపత్రాలను తీసుకొచ్చి రోడ్డుపై వేసేందుకు ప్రయత్నించారని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ ఐదుగురు వ్యక్తులు 2018 నుంచి మావోయిస్టు పార్టీ కార్యకర్తలకు ఆకర్షితులై మావోయిస్టులకు సహకరిస్తూ సానుభూతి పరుల నుంచి మలిషియా సభ్యులుగా కొనసాగుతున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ తెలిపాడు.

ఈ ఘటన నేపథ్యంలో అలర్ట్ అయిన ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం అటవీ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తుంది. అటవీ ప్రాంత సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలతో తనిఖీలను నిర్వహిస్తున్నారు. వారోత్సవాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ఘటనలు జరుగుతాయని ఏజెన్సీ ప్రాంతం బిక్కుబిక్కుమంటుంది. అటవీ ప్రాంతంలో ఉండే గుత్తి కోయ గ్రామాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

ఆదివాసీలకు పోలీసు వారు చేయూతనిస్తూ వారికి అండగా నిలబడడమే కాకుండా కొత్త వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయం ఇవ్వకూడదని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదివాసీలకు సూచనలు ఇస్తున్నారు. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం వాజేడు ఏటూరు నాగారం సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేక పోలీసు బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు