రిపోర్టర్ : వేణు
లొకేషన్ : భూపాలపల్లి
ఈ ఫోటో చూసి చిరుత అనుకొని భయపడిపోవద్దు. ఎందుకంటే అది చిరుత కాదు. చిరుత పోలికలతో ఉన్న కుక్క. దీనిని సడన్ గా చూస్తే తప్పకుండా గుండె ఝల్లుమంటుంది. ఎందుకంటే..దీని ఒంటిపై ఉన్న చారలు అచ్చం చిరుత పులి చర్మంపై ఉన్న చారల్లాగానే ఉన్నాయి. దీంతో అంతా ఈ కుక్కను చాలా విచిత్రంగా చూస్తున్నారు. చిరుత పులికి కుక్కకు పుట్టిన చిరుత పులి కుక్కా అని కూడా ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి ఇది చిరుత పులికి.. కుక్కకు పుట్టిన కుక్క కాదు. ఇది సాధారణ కుక్కే. కానీ రంగు మారిందంతే.
ఇన్‌కం ట్యాక్స్ రేట్లు సవరించే యోచనలో ప్రభుత్వం..? లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ వింత సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పలిమెల మండలం దమ్మూరు గ్రామ పంచాయతీ బూర్గుగూడెంలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు రంగులు వేశాడు. అచ్చం పులిలా కనిపించేలా..దాని ఒంటికి పులి చారలతో రంగులు వేశాడు. మామూలుగా ఈ శునకాన్ని చూసిన వెంటనే ఒక్కసారిగా పులే అనుకుని భయపడిపోవడం ఖాయం.
తన వ్యవసాయ భూముల్లో పంటను కాపాడుకునేందుకు ఈ ఐడియా వేసినట్టుగా ఆ రైతు చెప్పాడు. ఈ మధ్య కోతుల బెడద బాగా పెరిగిపోయింది. ఎలుగుబంట్లు సహా.. పలు వన్యప్రాణులు కూడా పొలాలపై పడి దాడులు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇలా కుక్కలు, వన్య ప్రాణుల బెడద తప్పించుకునేందుకు ఇలా తన పెంపుడు కుక్కకు పులిలా వేషం వేసినట్టు ఆ రైతు చెప్పాడు. రైతు ఐడియా కూడా వర్కవుట్ అవుతోంది. పులి తోలు కప్పుకున్న కుక్కను చూసి కోతులు, పలు జంతువులు పరారవుతున్నాయి. అసలు ఈ అటు వైపే రావడం మానేశాయట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dog, Local News, Mulugu, Telangana