హోమ్ /వార్తలు /తెలంగాణ /

సరైన రవాణా సౌకర్యాలు లేక ఇంటర్మీడియట్ పరీక్ష మిస్సయిన విద్యార్థి!..

సరైన రవాణా సౌకర్యాలు లేక ఇంటర్మీడియట్ పరీక్ష మిస్సయిన విద్యార్థి!..

ఎగ్జామ్ మిస్సైయిన విద్యార్థి

ఎగ్జామ్ మిస్సైయిన విద్యార్థి

Telangana: మార్చి నెల వచ్చిందంటే చాలు విద్యార్థులకు పరీక్షల సమయం వచ్చినట్టే. పరీక్షల నిర్వహణలో భాగంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేశామని.. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలుకలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అధికారులు చెప్తుంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

మార్చి నెల వచ్చిందంటే చాలు విద్యార్థులకు పరీక్షల సమయం వచ్చినట్టే. పరీక్షల నిర్వహణలో భాగంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేశామని.. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలుకలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అధికారులు చెప్తుంటారు. అంతేకాకుండా పరీక్షల సమయం వచ్చిందంటే చాలు సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్ లలో కూడా ఒక పోస్ట్ మాత్రం చక్కర్లు కొడుతుంది. అది ఏమిటంటే 'పరీక్షల సమయం కాబట్టి విద్యార్థులు ఎవరినైనా లిఫ్ట్ అడిగితే దయచేసి లిఫ్ట్ ఇచ్చి పరీక్ష కేంద్రాల వద్ద దింపండి' అని పోస్టు వైరల్గా మారుతుంటుంది. కానీ ఇలాంటివి కేవలం సోషల్ మీడియాకి పరిమితం అవుతుంటాయి.

నేటికీ రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పరీక్షలకు దూరం అయ్యే విద్యార్థులు ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఈ ఘటన చూస్తే నమ్మాల్సిందే. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోనిప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఏటూరు నాగారం మండల కేంద్రానికిసుమారు 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో శివపురం అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన దాసరి సత్యనారాయణఈ రోజుఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్ష రాయాల్సి ఉంది.దాసరి సత్యనారాయణ ఏటూరు నగరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్ లో పరీక్ష రాయాల్సి ఉంది.

కానీ, సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో 15 నిమిషాలు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్ళాడు. దీంతో కళాశాల సిబ్బంది పరీక్ష రాయడానికి అనుమతి లేదని ఖరాకండీగా చెప్పేశారు. అయినప్పటికీ విద్యార్థి మాత్రం తనపై జాలితో అయినా పరీక్షకు అనుమతి ఇస్తారు కావచ్చని అర్థగంటసేపు గేటు బయటే నిస్సహాయ స్థితిలో కూర్చుండిపోయాడు. కానీ ఫలితం శూన్యం. చేసేదేమీ లేక తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. రవాణా సౌకర్యాలు లేని విద్యార్థులను అధికారులు గుర్తించి వారికి హాస్టల్ సదుపాయం లేదా రవాణా సౌకర్యం ఉన్నా ప్రాంతాలలో వసతి కల్పిస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేవి కావచ్చు.

శివపురం గ్రామం ఏటూరు నాగారానికి కేవలం ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది. కానీ జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సులు మాత్రం వెళ్లవు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు సైతం వెళ్ళవు. ములుగు జిల్లాలో ఇప్పటికీ బస్సులు నడవని గ్రామాలు ఎన్నో ఉండగా.. శివపురం అందులో ఒకటి. ఈ కారణంగానే సత్యనారాయణ పరీక్షా కేంద్రానికి వెళ్లడం ఆలస్యమైంది. ఇలా సదుపాయం లేని గ్రామమని తెలిసినా కొంచెం ముందుగానే పరీక్షా కేంద్రానికి వెళ్లాల్సిన విద్యార్థి కూడా అలసత్వం వహించాడు. ఫలితంగా పరీక్షకు హాజరుకాలేకపోయాడు.

ములుగు జిల్లా ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి.. దేశంలో మొట్టమొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పటి నుంచి ములుగు నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. అయినప్పటికీ ములుగు మాత్రం ఆశించినంత స్థాయిలో అభివృద్ధి చెందలేదు. రవాణా సౌకర్యం లేక ఈ రోజు ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి పరీక్షకు హాజరు అవ్వలేకపోయాడు. రవాణా సౌకర్యం లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడే గ్రామాలు ఎన్నో ఉన్నాయనే దానికి ఈ ఘటన మరో నిదర్శనం.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు