హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: మిస్టర్ తెలంగాణ టైటిల్ కైవసం చేసుకున్న సింగరేణి యువకుడు

Mulugu: మిస్టర్ తెలంగాణ టైటిల్ కైవసం చేసుకున్న సింగరేణి యువకుడు

బాడీ బిల్డింగ్ లో సత్తాచాటిన యువకుడు

బాడీ బిల్డింగ్ లో సత్తాచాటిన యువకుడు

Mulugu: 2022 మిస్టర్ తెలంగాణ టైటిల్ కైవసం చేసుకున్న సింగరేణి యువకుడు పంజాబ్, లుధియానాలో జరగబోయే మిస్టర్ ఇండియా పోటీలకు సైతం ఎంపికయ్యాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Venu Medipelly, News18, mulugu

2022 మిస్టర్ తెలంగాణ టైటిల్ కైవసం చేసుకున్న సింగరేణి యువకుడు

పంజాబ్ , లుధియానాలో జరగబోయే మిస్టర్ ఇండియా పోటీలకు సైతం ఎంపికయ్యాడు. 300 మందికి పైగా బాడీ బిల్డర్లు పాల్గొన్న పోటీలో మొదటి స్థానం సాధించాడు శ్రీనివాస్ రెడ్డి.

బాడీ బిల్డింగ్ పోటీలు.. ఏజెన్సీ మారుమూల ప్రాంతాలలో వీటిపై ఎవరికి ఎక్కువగా ఆసక్తి ఉండదు. చాలామందికి ఇలాంటి పోటీలు జరుగుతాయని కూడా తెలియదు. బాడీ బిల్డింగ్ అనగానే ఒక ప్రముఖ సినిమాలో హీరో విక్రమ్ బాడీ బిల్డింగ్ చేయడం ఒక ప్రముఖ మోడల్ గా ఎదగడం సినిమాలో చూస్తూ ఉంటాం. కానీ భూపాలపల్లి లాంటి మారుమూల ప్రాంతం నుంచి ఒక యువకుడు ఏకంగా మిస్టర్ తెలంగాణ టైటిల్ సాధించడంతో పాటు మనందరం గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు.

2022 మిస్టర్ తెలంగాణ పోటీలు నల్గొండ జిల్లా దేవరకొండ కేంద్రంలో నిర్వహించారు. ఈ పోటీలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 300 మందికి పైగా బాడీ బిల్డర్లు పాల్గొన్నారు... వారిలో భూపాల్ పల్లి ప్రాంతం నుంచి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు... 300 మందికి పైగా బాడీ బిల్డర్ వారి యొక్క బాడీని ప్రదర్శించారు. శ్రీనివాస్ రెడ్డి 85 కేజీల విభాగంలో మిస్టర్ తెలంగాణ టైటిల్ కైవసం చేసుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.. అంతేకాకుండా ఓవరాల్ టైటిల్ని సైతం కైవసం చేసుకున్నాడు.

మిస్టర్ ఇండియా సాధించాలనే అతని కళ త్వరలోనే సహకారం అవుతుంది కాబోలు. వచ్చేనెల 21,22,23 తేదీలలో పంజాబ్ లుధియానాలో జరగబోయే మిస్టర్ ఇండియా పోటీలకు సైతం శ్రీనివాసరెడ్డి అర్హత సాధించాడు. త్వరలో జరగబోయే మిస్టర్ ఇండియా టైటిల్ సైతం కైవసం చేసుకుంటానని ధీమా శ్రీనివాసరెడ్డి వ్యక్తం చేస్తున్నాడు.

గుర్తింపు కరవు.....

300 మందికి పైగా ఈ పోటీలలో బాడీ బిల్డర్లు పోటీపడ్డారు అందరినీ ఓడించి శ్రీనివాస్ రెడ్డి టైటిల్ గెలుచుకోవడం చాలా గొప్ప విషయం. కానీ అతనికి మాత్రం సొంత ప్రాంతంలో తగిన గుర్తింపు రావడం లేదు. సాదాసీదా పోటీలలో పాల్గొని బంగారు పతకం సాధించాలని అందరూ అనుకుంటున్నారు. కానీ వర్కౌట్ చేయడం, సరైన డైట్ మెయింటెయిన్ చేయడం చాలా కష్టమైనని... అదే ఒక సినీ హీరో వర్కౌట్ చేసి సిక్స్ ప్యాక్స్, 8 ప్యాక్స్ చేస్తే మాత్రం గుడ్డలు చింపుకొని అభిమానులు ఎగిరి గంతులు వేస్తుంటారు.

కానీ మన మధ్యలో ఒక వ్యక్తి మిస్టర్ తెలంగాణ టైటిల్ సాధించుకున్నప్పటికీ గుర్తించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి మారుమూల ప్రాంతం నుంచి మిస్టర్ ఇండియా పోటీలకు అర్హత సాధించిన శ్రీనివాస్ రెడ్డికి తగిన ప్రోత్సాహం అందించి అతనికి కావలసిన సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉంది.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు