హోమ్ /వార్తలు /తెలంగాణ /

వామ్మో నాలుగేళ్లకే గుండెపోటు.. లక్షణాలు ఇవే..! ఈ జాగ్రత్తలు మస్ట్

వామ్మో నాలుగేళ్లకే గుండెపోటు.. లక్షణాలు ఇవే..! ఈ జాగ్రత్తలు మస్ట్

X
గుండెపోటు

గుండెపోటు లక్షణాలు ఇవే

అధిక బరువులు ఎత్తడం వల్ల కూడా దాని ప్రభావం గుండెపై పడుతుంది.నగర ప్రాంతాలలో మానవుడు ఎక్కువగా కూర్చుని పని చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఉబకాయం పెరిగిపోతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

Venu Medipelly, News18, Mulugu

యువతను కలవర పెడుతున్న నిశ్శబ్ద హంతకి...హాయిగా నిద్రపోయిన వారు నిద్రపోయినట్టే చనిపోతున్నారు పనిచేస్తున్న వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలను విడిచేస్తున్నారు నాలుగు పదుల వయసు దాటని యువతను హార్ట్ ఎటాక్ కలవరపెడుతుంది. మరి అంతలా ఎందుకు గుండెపోటు యువతపై ప్రభావం చూపిస్తుంది. గుండెపోటు ఎలాంటి వారిని ఎక్కువ కలవరపెడుతుంది. రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గుండెపోటు ఎవరికీ తొందరగా అటాక్ అవుతుందో తెలుసుకోవడం కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకోవడం కోసం న్యూస్ 18 సీనియర్ వైద్యనిపుణులు డాక్టర్ జగదీశ్వర్ తో ముచ్చటించింది.

Read Also : Warangal : చదివింది పదో తరగతి.. కానీ చేసేది డాక్టర్ వృత్తి..! చివరికి..!!

గుండెపోటు వారసత్వంగా వచ్చే అవకాశం కూడా ఉంటుందట. ఈరోజుల్లో మానవుడు టెక్నాలజీతో పాటు గడియారంతో పోటీపడి పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మనిషి అనేక తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నాడు. అనేక రకమైన ఆలోచనలు టెన్షన్స్ పెట్టుకొని మానవుడు తన సగటు జీవితాన్ని గడిపిస్తున్నాడు. గతంలో గుండెపోటు పేదవారికి రాదు అనే ఒక నానుడి ఉండేది. కానీ ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు అందరిపై దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎందుకు వస్తుందో కూడా తెలియకుండానే మనుషులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అందుకే దీనిని నిశ్శబ్ద హంతకి అని కూడా చెప్తూ ఉంటారు.

మానవుడు ఎప్పుడైతే అధిక ఒత్తిడికి గురి అవుతాడు అప్పుడు దాని ప్రభావం గుండెపై పడుతుంది కాబట్టి ఒత్తిడికి గురయ్యే వ్యక్తులకు గుండెపోటు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో దీని ప్రభావం ఎక్కువగా యువతపై ఉంటుంది దానికి కారణం అనేకమంది యువత ఈ రోజుల్లో చెడు అలవాట్లకు బానిసవుతున్నారు. కలిసి మద్యం సేవించడం, ధూమపానం చేయడం లాంటి ఎన్నో చెడు అలవాట్లను యువత అలవాటు చేసుకుంటున్నారు, ఈ తరుణంలోనే యువతపై కూడా గుండెపోటు ప్రభావం చూపిస్తుంది, ఈ మధ్యకాలంలో చాలామంది తమ శరీరంపై దృష్టి పెట్టి వ్యాయామశాలల్లో అధిక బరువులు ఎత్తడం జరుగుతుంది ఇలా చేయడం కూడా ప్రమాదమే ఎందుకంటే శక్తికి మించి ఎలాంటి పని చేయరాదు.

అధిక బరువులు ఎత్తడం వల్ల కూడా దాని ప్రభావం గుండెపై పడుతుంది.నగర ప్రాంతాలలో మానవుడు ఎక్కువగా కూర్చుని పని చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఉబకాయం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే గుండెకు సంబంధించిన ఇబ్బంది కూడా ఎదురవుతూ ఉంటుంది. ఇది రాకుండా ఉండాలంటే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే శక్తికి మించిన వ్యాయామం ఎప్పుడు చేయకూడదు. చాలా ప్రశాంతమైన వ్యాయామాన్ని చేయడం అవసరం అలాగే మానవుడు నిత్యం ఏదో ఒక ఒత్తిడికి గురి అవుతున్నాడు. ఎప్పుడూ కూడా మానవుడు ఉల్లాసమైన, ఉత్సాహమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

అధిక సంపాదన అధిక ఆశ ఎప్పుడైతే ఆశపడుతుంటామో అది అనర్ధానికి దారి తీస్తూ ఉంటుంది. యువత కూడా ఎక్కువగా మద్యపానాన్ని, ధూమపానానికిదూరంగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే గుండెపోటు వచ్చే అవకాశం ఉండదు అని వైద్యులు చెప్తున్నారు

First published:

Tags: Local News, Mulugu, Telangana