హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: కన్నుల పండుగగా సైన్స్ ఎగ్జిబిషన్.. విద్యార్థుల ఆవిష్కరణలు అద్భుతం

Mulugu: కన్నుల పండుగగా సైన్స్ ఎగ్జిబిషన్.. విద్యార్థుల ఆవిష్కరణలు అద్భుతం

X
విద్యార్తుల

విద్యార్తుల ప్రత్యేక ట్యాలెంట్

Mulugu: నేటి బాలలే రేపటి పౌరులు అంటారు.. కానీ నేటి బాలలే రేపటి సైంటిస్టులు కూడా. పాఠశాల విద్యార్థులు కొత్త తరం సృజనాత్మకత ఆలోచనలు వెలికి తీసే ప్రయత్నం నిరంతరం జరుగుతూనే ఉంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Venu Medipelly, News18, mulugu

నేటి బాలలే రేపటి పౌరులు అంటారు.. కానీ నేటి బాలలే రేపటి సైంటిస్టులు కూడా. పాఠశాల విద్యార్థులు కొత్త తరం సృజనాత్మకత ఆలోచనలు వెలికి తీసే ప్రయత్నం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. వాటికి ఉదాహరణ గానే పాఠశాలలో నిర్వహించే సైన్స్ ఎగ్జిబిషన్లను చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా విద్యార్థుల్లో దాగున్న ఇన్నోవేటివ్ ఆలోచనలు ప్రయోగాత్మకంగా ప్రదర్శించబడతాయి. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థులకు సాంకేతికతతో పాటు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంటాయి.

ములుగు జిల్లాలో మూడు రోజులపాటు జిల్లా పరిధిలో అన్ని పాఠశాల విద్యార్థులకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ మూడు రోజులపాటు పాఠశాల విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. కన్నుల పండుగగా ఈ కార్యక్రమాన్ని అధికారులు పాఠశాల విద్యార్థులు తిలకించారు. మొత్తం ఎగ్జిబిషన్ లో భాగంగా 200కు పైగా విద్యార్థులు తమ యొక్క ప్రాజెక్టులతో అలరించారు. ఇందులో రెండు రాష్ట్రస్థాయికి ఎంపికవగా ఎనిమిది బెస్ట్ ప్రదర్శన సెలెక్ట్ చేయడం జరిగింది.

దాదాపు రెండు సంవత్సరాల అనంతరం ఇలాంటి ఎగ్జిబిషన్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు చెప్తున్నారు. అలాగే ఏ విద్యార్థులు ఎలాంటి టాలెంట్ దాగి ఉందో ఉపాధ్యాయులు నిరంతరం గుర్తించాల్సి ఉంటుంది. నేటి బాలలే రేపటి సైంటిస్టులు అనే విధంగా ఏ విద్యార్థులు ఎలాంటి ఇన్నోవేటివ్ ఆలోచనలు దాగి ఉన్నాయో వాటిని వెలికి తీసే ప్రయత్నం ఇలాంటి కార్యక్రమాల ద్వారా జరుగుతుంది.

ముఖ్యంగా పంట పొలాలలో రైతులు కష్టపడి పండించిన పంట జంతువులు నాశనం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే రైతులు అనేక విధాలుగా ఆలోచించి వాటిని బెదిరించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ పాఠశాల విద్యార్థి ఆవిష్కరించిన ప్రాజెక్ట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సోలార్ బ్యాటరీతో నడిచే మోటార్ ద్వారా పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ అటవీ జంతువులను తరిమివేయచ్చు.

మరో విద్యార్థి ఆవిష్కరణ అందరిని గొప్పగా ఆలోచించే విధంగా చేసింది. రాను రాను వైల్డ్ లైఫ్ అనిమల్స్ అంతరించిపోతున్న నేపథ్యంలో ఎక్కువ శాతం వైల్డ్ లైఫ్ అనిమల్స్ రైల్వే ట్రాక్ దాటుతూ మృత్యువాత పడుతున్నాయి. ఇలాంటి వార్తలు మనం తరచూ వార్తల్లోనే చూస్తుంటున్న ఈ నేపథ్యంలో పాఠశాల విద్యార్థి అద్భుతమైన ఆవిష్కరణతో అలరించింది. ముఖ్యంగా రైల్వే ట్రాక్ మధ్యలో ఒక సెన్సార్లు ఏర్పాటు చేస్తే ట్రాక్పై అనిమల్స్ దాటే సమయంలో ఆ సెన్సార్ ఫ్రీక్వెన్సీ ద్వారా సమీపంలోని రైల్వే స్టేషన్ కు సమాచారం అందుతుంది. వెంటనే అక్కడి సిబ్బంది ఆ సెన్సార్ వద్ద వెళ్లి వాటిని కాపాడవచ్చు.

ఇలాంటి ప్రయత్నాలు ద్వారా సూసైడ్ కూడా అడ్డుకోవచ్చని విద్యార్థులు చెప్తున్నారు. మొత్తం ఈ సైన్స్ ఎగ్జిబిషన్ మూడు రోజులపాటు అధికారులు నిర్వహించారు. విజయవంతంగా అధికారులు ఈ సైన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా సైన్స్ అధికారి జయదేవ్ న్యూస్ 18 తో మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ఇన్నోవేటివ్ ఆలోచనలు వెలికి తీసే ప్రయత్నంగానే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని.. ది బెస్ట్ ప్రాజెక్టులను ప్రభుత్వాలకు ఉపయోగపడే విధంగా ఉంటే పేటెంట్ హక్కులను సైతం కల్పిస్తూ కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు