Home /News /telangana /

MULUGU A MASSIVE CRACKDOWN ON MARIJUANA IN JOINT WARANGAL DISTRICT ABH BRV MMV

Mulugu: రూటు మార్చిన కేటుగాళ్లు: పక్కా సమాచారంతో గంజాయి తరలింపు అడ్డుకున్న పోలీసులు

రూ. 55 లక్షల విలువగల 550 కిలోల ఎండు గంజాయి పట్టివేత

రూ. 55 లక్షల విలువగల 550 కిలోల ఎండు గంజాయి పట్టివేత

బొలెరో వాహనంలో అక్రమంగా రూ. 55 లక్షల విలువగల 550 కేజీల ఎండు గంజాయిని భద్రాచలం నుంచి వయా నర్సంపేట మీదుగా నారాయణఖేడ్ తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు నర్సంపేట పాకాల రహదారిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    (M.Venu, News 18, Mulugu)

    పోలీసులను ఏమార్చి.. రూటు మార్చి.. గంజాయి తరలిస్తున్న కేటుగాళ్లను నర్సంపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి వెల్లడించిన వివరాల ప్రకారం... బొలెరో వాహనంలో అక్రమంగా రూ. 55 లక్షల విలువగల 550 కేజీల ఎండు గంజాయిని భద్రాచలం నుంచి వయా నర్సంపేట మీదుగా నారాయణఖేడ్ తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు నర్సంపేట పాకాల రహదారిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన బొలెరో వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా వాహనంలో సంచులలో భారీగా ఎండు గంజాయి ఉంది. వాహన డ్రైవర్ వాగ్య హనుమంతు నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న నర్సంపేట పోలీసులు అందులో ఉన్న 550 కిలోల ఎండు గంజాయిని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.55 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నర్సంపేట ఏసీపీ సంపత్ రావు, రూరల్ సీఐ పులి రమేష్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది.

    నిషేదిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న వరంగల్ టాస్క్ ఫోర్స్: అక్రమంగా నిల్వఉంచిన నిషేదిత పొగాకు ఉత్పత్తులను వరంగల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. పోచమ్మకుంటకు చెందిన ఆకుల హరీష్ నిషేదిత పొగాకు ఉత్పత్తులను అక్రమంగా నిల్వ ఉంచాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు అతని నివాసంపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈతనిఖీలలో రూ. 6 లక్షలకు పైగా విలువగల పొగాకు ఉత్పత్తులు లభ్యమయ్యాయి. వెంటనే పోలీసులు ఆకుల హరీష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇతనిని విచారించగా ఎలుకతుర్తికి చెందిన భూపతి వెంకటేశ్వర్లు, హుజురాబాద్ చెందిన సత్తయ్య నుంచి గుట్కా మరియు ఇతర పొగాకు ఉత్పత్తులు వరంగల్ నగరానికి తీసుకువచ్చి క్రయవిక్రయాలు చేస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు.



    హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు 65 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బుడగ జంగాల కాలనీలలో హసన్‌పర్తికి చెందిన సింగిరి శంకర్ తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేస్తూ.. బయట మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈక్రమంలో అధిక మొత్తంలో రేషన్ బియ్యంను నిల్వఉంచాడన్న పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 25 క్వింటాల రేషన్ బియ్యంతో పాటు వాహనాన్ని కూడా సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు శంకర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

    Read This: Nagarkurnool: ప్రాణాలు తీస్తున్న కరెంట్: వ్యవసాయ బోర్ల వద్ద యమపాశాలుగా విద్యుత్ వైర్లు
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Mulugu, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు