Venu Medipelly News18, Mulugu
ములుగు జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో అనేక రకాల జాతులకు సంబంధించిన భారీ వృక్షాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ వృక్షాల వల్ల పర్యావరణం మానవాళికి ధన్య స్థానాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కానీ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం లో భాగంగా మానవాళికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టే మొక్కలను అధికారులు నాటుతున్నారు....
ఏమిటా మొక్క.?
కోనో కార్పస్ మానవాళికి ముప్పు తెచ్చే మొక్క దీనిద్వారా ముఖ్యంగా ఈ చెట్ల నుంచి వచ్చే పొప్పడి రేణువుల ద్వారా మానవాళికి శ్వాస కోసం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా భూగర్భ జలాలను సైతం ఈ మొక్క ఎక్కువగా పీల్చుకుంటుంది దీని ద్వారా భూగర్భ జలాలకు కూడా ప్రమాదం పొంచి ఉంది... ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొక్కలను నిషేధించింది.... అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో మాత్రం ఈ నిషేధాన్ని అధికారులు పాటించకుండా విరివిగా మొక్కలను నాటుతున్నారు.
ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన రెండు పల్లె ప్రకృతి వనాల్లో ఈ మొక్కలు విరివిగా పెరిగి ఫోను కార్పస్ వనంలా కనిపిస్తుంది. చూడటానికి పచ్చదనంగా కనిపించినప్పటికీ ఈ మొక్క ద్వారా ఎలాంటి ఉపయోగము మానవాళికి గాని పక్షులకు కీటకాలకు పర్యావరణానికి ఉపయోగం ఉండదు.
కొన్ని నగరాలలో ఈ మొక్కలను డివైడర్ల మధ్యలో పెంచడం జరిగింది కానీ ఎప్పుడైతే ప్రమాదం అని తెలిసిందో వెంటనే అప్రమత్తమైన అధికారులు వాటిని తొలగించడం కూడా జరిగింది మరి ములుగు జిల్లాలో ఉన్న అధికారులకు ఈ విషయం తెలియదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలిసి కూడా ఎందుకు మౌనం పాటిస్తున్నారు... ప్రమాదం అని తెలిసిన ఎందుకు పట్టించుకోవడం లేదు.
ములుగు జిల్లా ప్రాంతంలో ఎక్కువ అటవీ విస్తీర్ణం ఉంటుంది..... అధికారులు కొంచెం ఆలోచించి పర్యావరణానికి మానవాళికి వన్యప్రాణులకు ఉపయోగపడే మొక్కలను హరితహారంలో నాటితే ఎన్నో ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వం ఈ మొక్కలపై నిషేధం విధించినప్పటికీ వాటికి సంబంధించిన ఉత్తర్వులను సంబంధిత అధికారులకు పంపలేదా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.
ఒకవేళ వచ్చిన ఉత్తర్వులను అధికారులు తుంగలో తొక్కుతున్నారా అనే విమర్శలు సైతం వస్తున్నాయి ఇప్పటికైనా ములుగు జిల్లాలో విరివిగా పెంచుతున్న .కోన కార్పస్ మొక్కల విషయంలో అధికారులు పునరాలోచించి మొక్కలను తొలగించి మానవాళికి ప్రమాదం లేకుండా చూడాల్సిన అవసరం అధికారులపై ఉంది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana