Home /News /telangana /

MULUGU 75TH INDEPENDENCE DAY CELEBRATIONS IN MULUGU DISTRICT DISTRICT COLLECTOR PARTICIPATED IN 2K RUN ABH BRV MMV

Mulugu: స్వతంత్ర వజ్రోత్సవాలు: ఉప్పొంగిన ఉత్సాహంతో 'ఫ్రీడమ్ 2కే రన్"

వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన 2కే రన్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన 2కే రన్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

75 సంవత్సరాల స్వతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని ములుగు జిల్లా వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఊరు ఊరున, వాడవాడన ప్రజలు మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఫ్రీడం 2కే రన్ నిర్వహించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India
  (M.Venu, News 18, Mulugu)

  75 సంవత్సరాల స్వతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని ములుగు జిల్లా వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఊరు ఊరున, వాడవాడన ప్రజలు మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఫ్రీడం 2కే రన్నిర్వహించారు. జిల్లా కలెక్టర్ యస్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీఓ అంకిత్, ఏఎస్పీ సుధీర్ ఇతర ఉన్నతాధికారులు స్థానిక ప్రజలతో కలిసి ఉత్సాహంగా ఈ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

  75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. ఆజాది కా అమృత్ మహోత్సవ్ పురస్కరించుకుని ములుగు జిల్లా కేంద్రంలో గురువారం ఫ్రీడం రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, ఏఎస్పీ సుధీర్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ములుగు ఆసుపత్రి సెంటర్ నుండి గట్టమ్మ హరిత హోటల్ వరకు ఉత్సాహంగా ఫ్రీడం రన్లో పాల్గొన్నారు. ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిఆర్పిఎఫ్ స్పెషల్ పార్టీ సిబ్బంది, విద్యార్థులు యువకులు స్వచ్ఛంద సేవ సంస్థలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.  టూర్‌నాగారంలో నిర్వహించిన ఫ్రీడమ్ 2కే రన్ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ అంకిత్ ఏఎస్పీ అశోక్ కుమార్ ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఫ్రీడమ్ రన్‌లో విజేతగా నిలిచిన వారికి ఐటీడీఏ పిఓ అంకిత్... బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా ఐటీడీఏ పీఓ అంకిత్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్...అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల పోరాటం ఫలితంగా మనం ఈనాడు స్వేచ్ఛ పొందగలిగామని అన్నారు. ఈ పరుగు పందెంలో పోలీసు ఉన్నతాధికారులు, సిఆర్పిఎఫ్ జవాన్లు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాతో జాతీయ రహదారిపైమువ్వన్నెల జెండాతో పరుగు తీశారు. ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ ఫ్రీడం రన్లో పాల్గొన్నారు.

  ఇక జిల్లాలోని కమలాపురం, వెంకటాపురం, జగన్నాధపురం, పేరూరు, తాడ్వాయి, కన్నాయిగూడెం తదితర ప్రాంతాల్లో వజ్రోత్సవాలు నిర్వహించారు. ప్రజలు స్వచ్చందంగా ఈ వేడుకల్లో పాల్గొని, జాతీయ జెండాకు వందనాలు సమర్పించారు. విద్యార్థులు, ప్రభుత్వశాఖల ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా ఈ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో పాల్గొన్నారు.

  Read This; Vizag: మీ ఇంటికి తాళం వేశారా అంతే సంగతులు… మీరొచ్చేసరికి ఇళ్లంతా దోచేస్తారు..! జర జాగ్రత్త..!
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Local News, Mulugu, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు