Venu Medipelly, News18, mulugu
పూర్వకాలంలో రాజులు తమ సార్వభౌమాధికారం ద్వారా ప్రజలను శాసిస్తూ పాలన కొనసాగించేవారు. నేటి కాలంలో రాజులు లేరు.. రాజ్యాలు అంతరించిపోయాయి. కానీ సార్వభౌమాధికార మాత్రం సజీవంగా మిగిలి ఉంది. సార్వభౌమాధికారాన్ని ఎదురులేని శక్తిగా మనం చెప్పుకోవచ్చు. కానీ అంతటి శక్తి ఉన్న అధికారాన్ని ప్రజలు మాత్రం దుర్వినియోగం చేస్తున్నారు. అధికారాన్ని అమ్ముకుంటున్నారు. ప్రస్తుత కాలంలో భారత రాజ్యాంగం ప్రజలకు వయోజన ఓటు హక్కు ద్వారా సార్వభౌమాధికారాన్ని కల్పించింది.
Read Also : మన్యంలో ఆ తరహా దుస్తులకు గిరాకీ.. ఏడాదికి 9 నెలలపాటు డిమాండ్..!
ప్రలోభాలకు ఆశపడి తమ ఓట్లను అమ్ముకుంటున్న ఓటర్లు
\"ఓటర్లు అవును అన్న వాడు మంత్రి.. కాదు అన్నవాడు కంత్రి\".. కానీ ఓటర్లు ప్రలోభాలకు లొంగి ఓటు హక్కును బేరం పెట్టేస్తున్నారు. అలాంటి ఓటు హక్కుపై ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య వినూత్న పద్ధతిలో అవగాహన కల్పిస్తున్నారు. ఏకంగా 70 ఎం ఎం స్క్రీన్ ద్వారా ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో స్క్రీన్ పెట్టి జానపద కళాకారులతో అవగాహన కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్ తో న్యూస్ 18 మాట్లాడింది.
ఓటర్లే బహిరంగంగా మాకు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తాం అనే స్థాయికి దిగజారి పోయారు. అలాంటి వారికి మంచి నాయకులు ఎలా వస్తారు. మీరు చేసే ఈ కార్యక్రమం ములుగు జిల్లాలో ఎలాంటి ప్రయోజనాన్ని చేకూరుతుంది అని ప్రశ్నించగా.. కలెక్టర్ చెప్పిన సమాధానం ఇదే. ములుగు జిల్లా విస్తీర్ణంగా పెద్ద జిల్లా పూర్తిగా వెనుకబడిన జిల్లా కాబట్టి ఇక్కడ ప్రజలకు చైతన్యం కల్పిస్తే ఖచ్చితంగా వారిలో మార్పు వస్తుంది. ములుగు జిల్లా ప్రజలు పూర్తి అవగాహనతోటి ఓట్లు వేయాలంటే.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు ఓటు హక్కును ఏ విధంగా ఉపయోగించుకోవాలి.. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి.. ఎన్నికల సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలి అనే అంశాలు పూర్తిగా అర్థమవుతుంటాయి.
ఇక్కడ ఓటర్లను కూడా అధికారులు ప్రలోభపెట్టే అవకాశం ఉండదు. ఒకవేళ ఉంటే మా దృష్టికి వస్తే వెంటనే కఠిన చర్యలు కూడా తీసుకోవడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రజలలో చైతన్యం రావాలంటే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తీరాల్సిందే. ఇలాంటి కార్యక్రమాల ద్వారానే ప్రజలలో చైతన్యం కలిగి మంచి నాయకులను ఎన్నుకునే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ములుగు లాంటి ఇంటీరియల్ ప్రదేశాలలో చాలామందికి ఓటు హక్కు ఏ విధంగా ఉపయోగించాలి.. ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి ఏ విధంగా ఓటేయాలి అని అంశాలలో అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే 70 ఎం ఎం స్క్రీన్ ద్వారా వీటన్నిటిని నివృత్తి చేస్తూ ప్రజలకు అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నామని ప్రజల నుంచి మంచి స్పందన ఉందని కలెక్టర్ చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News