హోమ్ /వార్తలు /తెలంగాణ /

25 మంది కూలీలకు తీవ్ర అస్వస్థత.. ఆ నీటిలో ఏం కలిసిందో తెలుసా? రైతులూ బీ అలర్ట్

25 మంది కూలీలకు తీవ్ర అస్వస్థత.. ఆ నీటిలో ఏం కలిసిందో తెలుసా? రైతులూ బీ అలర్ట్

X
25

25 మంది కూలీలకు తీవ్ర అస్వస్థత... కారణం ఇదే..!

గురువారం మధ్యాహ్న సమయంలో భోజనం చేయడం కోసం 25 మంది కూలీలు పక్క మిర్చి చేనులో నిలువ ఉన్న కలుషితమైన తాగునీరు సేవించారు.అనంతరం వెంటనే కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రిపోర్టర్ : వేణు మేడిపల్లి

లొకేషన్ : వెంకటాపురం

ములుగు జిల్లాలో 25 మంది మిర్చి కూలి రైతులు కలుషిత నీరు త్రాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు త్రాగిన అనంతరం కూలీలకు వెంటనే వాంతులు విరోచనాలు అవడంతో అప్రమత్తమైన స్థానికులు ప్రాథమిక చికిత్స కోసం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాలు గోదావరి పరివాహ ప్రాంతంతో కలిసి ఉండటంతో అక్కడి రైతులు ఎక్కువగా మిర్చి పంటపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటారు. అంతేకాకుండా ఆ ప్రాంతానికి చెందిన మహిళలు ఎక్కువగా మిర్చి పొలం కూలీ పనులకు నిరంతరం వెళ్తూ ఉంటారు.  కూలీల జీవన పరిస్థితులు రెక్కాడితేకానీ డొక్కా నిండని పరిస్థితి ఉంటుంది. అనేకమంది మహిళలు కేవలం కూలి పనులపైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. పత్తి మిర్చి వరి వ్యవసాయ సాగు కూలి పనులు దొరికితేనే వారికి జీవనం గడుస్తుంది.

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని నూగురు సమీపంలోని గొల్లగూడెం గ్రామంలో 25 మంది కూలీలు మిర్చి చేనుకి కూలి పనులకు వచ్చారు. గురువారం మధ్యాహ్న సమయంలో భోజనం చేయడం కోసం 25 మంది కూలీలు పక్క మిర్చి చేనులో నిలువ ఉన్న కలుషితమైన తాగునీరు సేవించారు.అనంతరం వెంటనే కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు అవడంతో గమనించిన స్థానికులు వారందరిని వెంటనే వెంకటాపురం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ముగ్గురు కూలీల పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

సాధారణంగా అనేక మంది రైతులు వ్యవసాయానికి సాగునీరు అందించే క్రమంలో డ్రిప్ పద్ధతిని ఉపయోగిస్తుంటారు.  దీని ద్వారా సాగునీరు ఆదా చేయడంతో పాటు రైతులకు శ్రమ తక్కువగా ఉంటుంది. డ్రిప్ వ్యవస్థను ముఖ్యంగా ఎక్కువగా పత్తి మిర్చి రైతులు ఉపయోగిస్తుంటారు. పంట చేతికి వచ్చిన అనంతరం రైతులు పక్కకు పెడతారు. మళ్లీ వచ్చే సీజన్లో అవసరానికి నిమిత్తం భద్రపరచుకుంటారు ఈ నేపథ్యంలోనే రైతులు డ్రిప్ వ్యవస్థను శుభ్రపరచడం జరుగుతూ ఉంటుంది. డ్రిప్ పైపులను శుభ్రపరచడం కోసం రైతులు ఫాస్పరస్ ఆమ్లం ఉపయోగిస్తుంటారు.

ఫాస్పరస్ ఆమ్లం కలిసిన నీరు త్రాగడం వల్లే ఈ ఘటన జరిగిందని వైద్యులు గుర్తించారు.ఈ ఘటన ములుగు జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం సృష్టించింది.కుటుంబ పోషణ కోసం కూలి పనులకు వెళితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధాకరమని విచారణ వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Local News, Mulugu

ఉత్తమ కథలు