MRPS LEADER MANDA KRISHNA MADIGA FALL DOWN IN TOILET AND INJURED IN DELHI HERE IS MORE DETAILS SK
Manda Krishna Madiga: హోటల్ బాత్రూమ్లో జారిపడిన మందకృష్ణ మాదిగ.. తలకు గాయాలు!
మందకృష్ణ మాదిగ
విషయం తెలుసుకున్న కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి హోటల్ వద్దకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం ఆయన్ను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు గాయాలయ్యాయి. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్లో బాత్రూమ్లో ఆయన జారిపడ్డారు. ఈ ఘటనకు ఆయనకు తలతో పాటు పలు చోట్ల గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మందకృష్ణ మాదిగ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి హోటల్ వద్దకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం ఆయన్ను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ఆయన దగ్గరుండి మరి మందకృష్ణ మాదిగకు అందుతున్న వైద్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయనని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఐతే ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ రాజకీయాల్లో మందకృష్ణ మాదిక కొన్ని రోజులుగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకంపై తనదైన శైలిలో స్పందించారు. దళితులకు రూ.10 లక్షలు ఇవ్వడం మంచి విషయమే అని.. ఐతే ఇది వారిపై ప్రేమతో తీసుకొచ్చిన పథకం కాదని ఆయన విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ పథకాన్ని తెచ్చారని అన్నారు. మరోవైపు హుజూరాబాద్ ఉపఎన్నికల్లో మందకృష్ణ మాదిగ పోటీ చేస్తారని తెలంగాణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. టీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు మందకృష్ణ మాదిగను మహాజన సోషలిస్ట్ పార్టీ తరపున పోటీచేయించేందుకు బీజేపీ ప్లాన్ చేసిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మందకృష్ణ ఢిల్లీ పర్యటిస్తుండడం హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.