వెరైటి శిక్ష....మాస్క్ పెట్టని కొడుకు... తండ్రితో గుంజీలు తీయించిన తహాసీల్దార్...!

గుంజీలు తీయిస్తున్న తహసీల్దార్

కరోనా శిక్షలు : కరోనా కట్టడికి ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మాస్కులు పెట్టుకోని వారిపై కఠిన చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ తహాసీల్దార్ మాస్క్ పెట్టని వారిచే గుంజీలు తీయించింది.

  • Share this:
న్యూస్ 18మహబూబ్ నగర్...
సయ్యద్ రఫీ...

కరోనా కట్టడికి ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మాస్కులు పెట్టుకోని వారిపై కఠిన చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ తహాసీల్దార్ మాస్క్ పెట్టని వారిచే గుంజీలు తీయించింది.

రోజురోజుకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది లేకుంటే ఫైన్ వేయాలని అధికారులను ఆదేశించింది. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా జీవోను కూడ విడుదల చేసింది. మొదటి సారి వచ్చిన కరోనా కంటే సెకండ్ వేవ్ కరోనా చాల ప్రమాదకరంగా ఉండడంతో..దీన్ని కట్టడి చేయడమే మార్గంగా ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో బాగంగానే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని ప్రజలపై కఠిన చర్యలకు పాల్పడుతోంది. అయినా..కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా లేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అటు పోలీసు ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర్ర ప్రభుత్వ అధికారులు నేరుగా రంగంలోకి దిగారు.

ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ కేంద్రంలోని అధికారులు కఠినంగా వ్యవహరించారు. తహాసీల్ధార్ హిందూజా మాస్కులు లేకుండా బయటికి వచ్చిన వారిని గుర్తించి ఫైన్ లు వేశారు. అయితే తనిఖీలు చేస్తున్న మార్గంలోనే తండ్రితో కలిసి ఆరేళ్ల బాలుడు మాస్కులు లేకుండా వెళుతుండడాన్ని గుర్తించిన తహసిల్దార్ వారికి ప్రత్యేక శిక్ష వేసింది. తండ్రికి మాస్కు ఉన్నా చిన్నపిల్లవాడికి మాస్క్ లేకపోవడాన్ని గమనించింది. దీంతో ఆమె తండ్రికి ఉన్న మాస్కును పిల్లాడికి పెట్టించి, తండ్రిచేత గుంజీలు తీయించింది. ఈ సందర్భంగా తహసిల్దార్ సింధుజ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కు పెట్టుకోవాలని లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని పెట్టుకొని అందరూ సహకరించాలని ఆమె కోరారు ...

అయితే ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఇలాంటీ గుంజీల శిక్ష వేయమని ఎక్కడా చెప్పలేదు.. నిబంధలను పాటించని వారిపై 1000 రూపాయల జరిమాన విధించడంతో పాటు కేసులు పెట్టే అవకాశం ఇచ్చారు. మరి తహాసీల్దారు వేసిన శిక్షకు అటు ఉన్నతాధికారులు, ఇటు నెటిజన్‌ల అభిప్రాయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Published by:yveerash yveerash
First published: