హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS Congress: షబ్బీర్ అలీపై కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు.. ప్రియాంకాగాంధీకి లేఖ

TS Congress: షబ్బీర్ అలీపై కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు.. ప్రియాంకాగాంధీకి లేఖ

కోమటిరెడ్డి, ప్రియాంకాగాంధీ (ఫైల్​)

కోమటిరెడ్డి, ప్రియాంకాగాంధీ (ఫైల్​)

తెలంగాణ కాంగ్రెస్​లో మరో సంచలనం చోటుచేసుకుంది. సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీపై  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎటాక్​ చేశారు. అలీని తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన కోరారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ కాంగ్రెస్​లో (Telangana Congress) మరో సంచలనం చోటుచేసుకుంది. సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ (Former Minister Shabbir Ali)పై  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komati Reddy Venkat Reddy) ఎటాక్​ చేశారు. అలీని తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి (AICC General Secretary Priyanka Gandhi) ఆయన లేఖ రాశారు. చీటింగ్ సహా పలు ఇతర కేసుల్లో అలీకి ప్రత్యక్షంగా ప్రమేయం వుందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఆరోపించారు. ఆయనపై ఎఫ్​ఐఆర్​ కూడా నమోదయిందని కోమటిరెడ్డి తెలిపారు. ఈ కేసుల నేపథ్యంలో షబ్బీర్ అలీ ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం వుందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ పరువు పోతుందని.. అలాగే నష్టం జరుగుతుందని వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్​ గాంధీ పాదయాత్ర కేరళలో ఉన్నట్లు లేఖలో కోమటిరెడ్డి తెలిపారు.

  అక్టోబర్ 10న విచారణకు రావాలని..

  కాగా, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఈడీ నోటీసులురావడం కలకలం సృష్టిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ యాక్ట్ 50 కింద నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. అక్టోబర్ 10న విచారణకు రావాలని ఆదేశించింది. కేంద్ర మాజీ మంత్రి రేణుక్ చౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి కూడా ఈడీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది. వీళ్లంతా నేషనల్ హెరాల్డ్ కు నిధులు సమకూర్చారని ఈడీకి గుర్తించిందని తెలుస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రశ్నించారు ఈడీ అధికారులు.

  నేషనల్ హెరాల్డ్ కేసులో తనకు ఈడీ నోటీసులు వచ్చాయన్న వార్తలపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందించారు. తనకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. అయితే పత్రిక నడపడానికి కొంత ఫండ్ మాత్రం తాను ఇచ్చానని షబ్బీర్ అలీ అంగీకరించారు. ఈడీ నోటీసులు వచ్చే విచారణకు హాజరవుతానని తెలిపారు.

  ఇదే కేసు..

  1938లో జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. ఏజెఎల్‌గా పిలిచే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ నేషనల్ హెరాల్డ్ వార్తలను ప్రచురించేది. ఇందులో 5 వేల మంది స్వాతంత్య్ర సమర యోధులు షేర్ హోల్డర్లుగా ఉండేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఈ పత్రికను కాంగ్రెస్ ఉపయోగించుకుంది. 2008లో ఈ న్యూస్ పేపర్ మూతపడగా.. ఆ సంస్థ అప్పులు తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ వడ్డీ లేకుండా రూ.90.25 కోట్లు అప్పుగా ఇచ్చింది.

  Telangana: ఎన్నికలొస్తేనే కేసీఆర్​కు ప్రజలు గుర్తుకొస్తారు.. అక్కడ పథకాలు వస్తాయి: ఈటల

  2010లో యంగ్ ఇండియా పేరిట ఓ ఎన్జీవో ఏర్పాటు చేయగా.. దానికి రాహుల్ గాంధీ డైరక్టర్గా ఉండేవారు. సోనియా గాంధీ, మోతీలాల్వోరా, ఆస్కార్ ఫెర్నాండేజ్‌లు ఇందులో షేర్హోల్డర్‌లుగా ఉన్నారు. మరోవైపు 2010 నాటికి ఏజేఎల్‌కు 1057 మంది షేర్ హోల్డర్లు ఉండేవారు. 2011లో ఏజేఎల్‌కు చెందిన హోల్డింగ్స్‌ను యంగ్ ఇండియాకు బదిలీ చేశారు. దీంతో నేషనల్ హెరాల్డ్‌కు ఉన్న ఆస్తులన్నీ యంగ్ ఇండియా వశం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం రూ.90 కోట్లు మాత్రమే ఏజేఎల్‌కు రుణం ఇవ్వగా.. ఆ సంస్థ పేరిట ఢిల్లీ సహ పలు నగరాల్లో ఉన్న ఆస్తులన్నీ యంగ్ ఇండియా చేతికి వెళ్లాయి. నేషనల్ హెరాల్డ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న వందల కోట్ల ఆస్తుల కోసమే కాంగ్రెస్ ఇలా చేసిందనే ఆరోపణలున్నాయి.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Enforcement Directorate, Komatireddy venkat reddy, Priyanka Gandhi, TS Congress

  ఉత్తమ కథలు