హోమ్ /వార్తలు /తెలంగాణ /

Komatireddy venkatreddy : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని చూసి సీఎం కేసిఆర్ బుద్ది తెచ్చుకోవాలి..

Komatireddy venkatreddy : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని చూసి సీఎం కేసిఆర్ బుద్ది తెచ్చుకోవాలి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Komatireddy venkatreddy : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. రేపటి నుండి తానేంటో చూపిస్తానని వ్యాఖ్యానించారు.కామారెడ్డి టు ఎల్లారెడ్డి వరకు సమస్యల సాధనపై ప్రత్యేక పోరాటం చేస్తున్నట్టు చెప్పారు.

ఇంకా చదవండి ...

కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతగా ఉన్న ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రత్యకంగా ఒక్కడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పారు. ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లా నుండి ఎల్లారెడ్డి వరకు సమస్యలపై పోరాటం చేసేందుకు ఉద్యమం చేస్తానని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన తానేంటో చూపిస్తానంటూ చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీనే తన బలం అని స్పష్టం చేశారు. మరోవైపు పార్టీ సీనియర్లప ఆయన మండిపడ్డారు.. గతంలో పార్టీ అధినేత పార్టీ అధినేత సోనియా గాంధీని స్వంతపార్టీ నేతలే అప్పుడు దయ్యం.. ఇప్పుడు దేవత అంటున్నారని ఎద్దెవా చేశారు...ఇక కొంతమంది నాయకులు పెద్ద లీడర్లు అని చెప్పుకొని పదవుల పంపకాలు చేసుకున్నారని విమర్శించారు... దీంతో 72- 78 సీట్లు వస్తాయని మంత్రులు, ముఖ్య మంత్రుల పదవులు పంపకాలు చేసుకున్నారని మండిపడ్డారు.

ఇక పరోక్షంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఓట్లు పార్టీ తీరుపై ఆయన సెటెర్లు వేశారు.. కాంగ్రేస్ పార్టీ లేదని భావిస్తున్న ఏపీలో ఆ పార్టీకి ఆరు వేల ఓట్లు వస్తే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నా హుజురాబాద్‌లో మాత్రం కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని అన్నారు.

ఇది చదవండి : పాడి కౌశిక్ రెడ్డికి మరో అవకాశం.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా.... ?


ఇక మంత్రి కేటీఆర్ సూటు బూటు వేసుకుంటే పెట్టుబడులు రావని అన్నారు... కాంగ్రెస్ అభివృద్ధి వల్లే ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలిని అన్నారు.. కాగా అసమ్మతి నేతగా ఉన్న కోమటిరెడ్డి గత కొద్ది రోజులుగా పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసందే...దీంతో ఆయన్ను దారిలోకి తీసుకువచ్చేందుకు ఈ క్రమంలోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీ కోమటిరెడ్డిని బుజ్జగించే బాధ్యతను పార్టీ సీనియర్ నేతకు అప్పగించినట్టు సమాచారం.

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుందని అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే దుబ్బాక ఎన్నికల తర్వాత రేవంత్ ఎన్నో ఆరోపణలను సొంత పార్టీ నేతల నుంచే ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఓ మాజీ నేత పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.


ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌కు షాక్ తగలనుంది. మాజీ ఎమ్మెల్సీ ఒకరు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కమిటీలను ఇష్టారాజ్యంగా మార్చడంపై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లాలోని తన వర్గం నేతలతో భేటికానున్నారు. భవిష్యత్ కార్యాచరణను ప్రేమ్ సాగర్‌రావు ప్రకటించనున్నారు.

First published:

Tags: Hyderabad, Komatireddy venkat reddy

ఉత్తమ కథలు