రాజమౌళి, సైనాకు ఎంపీ కవిత గ్రీన్ ఛాలెంజ్

గ్రీన్ ఛాలెంజ్‌లో ఎంపీ కవిత నామినేట్ చేసిన నలుగురు సెలబ్రిటీలు తలా మూడు ముక్కలు నాటి...మరికొందరిని ఛాలెంజ్‌లో నామినేట్ చేయాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: July 21, 2018, 6:10 PM IST
రాజమౌళి, సైనాకు ఎంపీ కవిత గ్రీన్ ఛాలెంజ్
గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్క నాటుతున్న టీఆర్ఎస్ ఎంపీ కవిత
  • Share this:
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళిలకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. తాము చాలెంజ్ ను స్వీకరిస్తున్నామని, మొక్కలు నాటుతామని వారు ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని తన ఇంటి ముందు ఎంపి కవిత గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా మూడు మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్‌‌లో భాగంగా మహమూద్ అలీ, రాధాకృష్ణ ,రాజమౌళి, సైనా నెహ్వాల్ వీరు ఒక్కొక్కరు మూడు మొక్కల చొప్పున నాటాల్సి ఉంటుంది.

గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కనాటిన ఎంపీ కవిత
గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కనాటిన ఎంపీ కవిత


ఈనెల 27న దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ హరితహారంలో భాగంగా వినూత్న రీతిలో గ్రీన్ చాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ కవిత పేరును నామినేట్ చేస్తూ..గ్రీన్ చాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. చాలెంజ్ ను స్వీకరించిన కవిత శనివారం మూడు మొక్కలు నాటి, మరో నలుగురికి చాలెంజ్ విసిరారు.

గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కనాటిన ఎంపీ కవిత
గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కనాటిన ఎంపీ కవిత


మొక్కలు నాటే కార్యక్రమం పోటీ తత్వంతో సాగేలా చేయడం చాలెంజ్ కార్యక్రమం ఉద్దేశమని ఎంపీ కవిత చెప్పారు. విరివిగా మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యం పెరిగి స్వచ్ఛ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. తద్వారా భూతాపం పెరగడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడం, అతివృష్టి లేదంటే అనావృష్టి, వాతావరణ మార్పులు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చనే విషయాన్ని అందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వ్యాఖ్యానించారు.

గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కనాటుతున్న ఎంపీ కవిత
గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కనాటుతున్న ఎంపీ కవిత


భవిష్యత్ తరాలకు మేలు చేసేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకోవాలని ఆమె కోరారు. గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు. మొక్కలు నాటడమే కాదు..ఆ మొక్కల సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని ఎంపి కవిత కోరారు.


Published by: Janardhan V
First published: July 21, 2018, 6:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading