హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dharmapuri Arvind: తెలంగాణలో ఐదుగురు ముఖ్యమంత్రులు.. ఎంపీ అరవింద్ కామెంట్స్

Dharmapuri Arvind: తెలంగాణలో ఐదుగురు ముఖ్యమంత్రులు.. ఎంపీ అరవింద్ కామెంట్స్

ధర్మపురి అర్వింద్

ధర్మపురి అర్వింద్

2023లో జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీకీ బీజేపీని అడ్డుకునే దమ్ము లేదు. ఆ ఎన్నికల్లో బీజేపీని ఎదురించడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూటమి కడతారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఖతం అయింది. ఈ జగిత్యాలలోనే కాంగ్రెస్ అంతో ఇంతో ఉంది. దానికి కారణం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి నాకు అంకులే.

ఇంకా చదవండి ...

జగిత్యాల: తెలంగాణలో ఐదుగురు ముఖ్యంత్రులు పరిపాలన చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్ కుమార్ ల పేర్లను ప్రస్తావించకుండానే ఐదుగురు వ్యక్తులు తెలంగాణను పరిపాలిస్తున్నారని అర్వింద్ విమర్శలు గుప్పించారు. శనివారం జగిత్యాల పర్యటనకు ఆయన వెళ్లారు. జగిత్యాల పరిధిలోని లింగంపేట్ రైల్వే స్టేషన్ ని పరిశీలించి, రైల్వే స్టేషన్ లో కావాల్సిన కనీస వసతుల కొరకు నివేదిక సిద్ధం చేయాలని స్టేషన్ మాస్టర్ ను ఆదేశించారు.  ఆ తర్వాత కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరితీరుతుందన్నారు. సీఎం కుర్చీని బీజేపీ సొంతం చేసుకుంటుందన్నారు. కార్యకర్తలంతా కలిసి పనిచేస్తే కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడొచ్చని వ్యాఖ్యానించారు.

’మేం అధికారంలోకి రాగానే ఉపాద్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం. 2023లో జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీకీ బీజేపీని అడ్డుకునే దమ్ము లేదు. ఆ ఎన్నికల్లో బీజేపీని ఎదురించడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూటమి కడతారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఖతం అయింది. ఈ జగిత్యాలలోనే కాంగ్రెస్ అంతో ఇంతో ఉంది. దానికి కారణం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి నాకు అంకులే. ఆయనంటే అంటే నాకు ఇష్టం. రాష్ట్రంలో చనిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఎవరిని పీసీసీ అధ్యక్షుడిని చేసినా లాభం ఉండదు‘ అని ధర్మపురి అర్వింద్ కామెంట్స్ చేశారు.

కాగా, టీఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అర్వింద్, ఇటీవల గులాబీ పార్టీపై దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అండతో టీఆర్ఎస్ పై కయ్యానికి కాలు దువ్వుతున్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి, తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టిని తన వైపునకు తిప్పుకున్నారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలోనూ ధర్మపురి అర్వింద్ ప్రచారం చేశారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో బీజేపీ దూకుడు మరింతగా పెంచింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. దీంతోపాటు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీ బలాన్ని పెంచుకుని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీనివ్వాలని ప్రయత్నిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

First published:

Tags: Bandi sanjay, CM KCR, Dharmapuri Arvind, Telangana

ఉత్తమ కథలు