హోమ్ /వార్తలు /తెలంగాణ /

కరోనాపై పోరు... ఎంపీ డీఎస్ సాయం... ఆంధ్రప్రదేశ్‌కు కూడా...

కరోనాపై పోరు... ఎంపీ డీఎస్ సాయం... ఆంధ్రప్రదేశ్‌కు కూడా...

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్(ఫైల్ ఫోటో)

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్(ఫైల్ ఫోటో)

కరోనాపై పోరాటానికి తన వంతు సాయంగా ఎంపీ ల్యాడ్స్ నిధులు ప్రకటించారు డి.శ్రీనివాస్.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తమ వంతు సాయంగా ఎంపీ ల్యాడ్స్ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్న ఎంపీల జాబితాలో రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కూడా చేరారు. ఈ మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రూ. 50 లక్షలు ఇస్తున్నట్టు ఆయన కలెక్టర్‌కు లేఖ రాశారు. ఇందుకు సంబంధించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కోరారు. నిజామాబాద్ మినహా తెలంగాణ రాష్ట్రానికి మరో రూ. 50 లక్షలు ఇస్తున్నట్టు ఎంపీ డీఎస్ తన లేఖలో పేర్కొన్నారు. ఇక పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు సైతం డీఎస్ తన ఎంపీ ల్యాడ్స్ నిధులను కేటాయిస్తున్నారు. ఏపీకి రూ. 50 లక్షలు ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా తాను పని చేశానని.. అందుకే అక్కడి వారితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని డీఎస్ లేఖలో పేర్కొన్నారు. అందుకే ఏపీకి కూడా సాయం అందించాలని భావించానని తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Coronavirus, Covid-19, D Srinivas, Nizamabad, Telangana

ఉత్తమ కథలు