BJP MP Bandi Sanjay: దుబ్బాక నుంచే టీఆర్ఎస్ పతనం ఆరంభం...బండి సంజయ్

బండి సంజయ్(ఫైల్ ఫోటో)

దుబ్బాకలో ప్రచారంకు కేటీఆర్ వచ్చినా కేసీఆర్ వచ్చినా బిజేపీ గెలుపు ఖాయమని సంజయ్ అన్నారు. తనపై పోలీసులతో దాడి చేస్తే మేము కూడా ప్రతి దాడి చేస్తామని, ప్రభుత్వానికి పోలీసులు కొమ్ము కాయడం సరికాదని ఆయన అన్నారు.

  • Share this:
    టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ సమాధి దుబ్బాక నుండే మొదలవుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. తనను సిద్ధిపేట వెళ్ళకుండా ఆపి అరెస్ట్ చేసి వెనక్కు తీసుకువచ్చిన సంధర్భంగా కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తనపై దాడి చేసిన పోలీసులను విధుల నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. దుబ్బాకలో ప్రచారంకు కేటీఆర్ వచ్చినా కేసీఆర్ వచ్చినా బిజేపీ గెలుపు ఖాయమని సంజయ్ అన్నారు. తనపై పోలీసులతో దాడి చేస్తే మేము కూడా ప్రతి దాడి చేస్తామని, ప్రభుత్వానికి పోలీసులు కొమ్ము కాయడం సరికాదని ఆయన అన్నారు.

    నేను ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా ఫామ్ హౌస్ లో పడుకునే నాయకుడిని కాదు..ప్రజా నాయకుడినని ఆయన అన్నారు. దుబ్బాకలో ఓటమి భయం పట్టుకుంది కాబట్టి పోలీసులతో దాడులు చేయిస్తున్నారన్న అయన కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా కొమ్ముకాస్తున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని ఆయన అన్నారు. కొన్ని ప్రముఖ మీడియా చానెళ్లు తన సహనాన్ని పరీక్షిస్తున్నాయన్న ఆయన రాబోయే రోజుల్లో తెలంగాణలో మీడియాకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే రోజులు వస్తాయని అన్నారు.
    Published by:Krishna Adithya
    First published: