హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ys Viveka Murder Case: తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్

Ys Viveka Murder Case: తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్

ఎంపీ అవినాష్ రెడ్డి

ఎంపీ అవినాష్ రెడ్డి

Ys Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

Ys Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ ను దాఖలు చేశారు. కాగా గతంలో ఈ కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని పిటీషన్ దాఖలు చేయగా..తాజాగా కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు. ఇక ఇప్పటివరకు 4 సార్లు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు.

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తుపై సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డికి అలాగే అతని తండ్రి భాస్కర్ కు సీబీఐ (CBI) నోటీసులు ఇచ్చింది. అంతేకాదు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy)ని సీబీఐ పలుమార్లు విచారించి మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో సీబీఐ (CBI) విచారణపై ఎంపీ అవినాష్ రెడ్డి  (Mp Avinash Reddy) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ సందర్బంగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐకి (CBI) ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి రిట్ పిటీషన్ దాఖలు చేశారు. అలాగే న్యాయవాది సమక్షంలోనే సీబీఐ విచారణ జరిగేలా చూడాలని ఈ పిటీషన్ లో పేర్కొన్నారు. అంతేకాదు తనకు 150 సీఆర్పీసీ కింద సీబీఐ (CBI) నోటీసులు ఇచ్చిందని..ఈ నోటీసుల ప్రకారం తనను అరెస్ట్ చేయకూడదని కోర్టు సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు సమర్పించిన పిటీషన్ లో అవినాష్ రెడ్డి  (Mp Avinash Reddy) పేర్కొన్నారు.

AP Group-1 Mains: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా..కొత్త డేట్స్ ఇవే..

దీనిపై విచారణ జరిపిన కోర్టు అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) ని అరెస్ట్ చేయొద్దని చెప్పలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు అవినాష్ రెడ్డి పిటీషన్ ను తిరస్కరించింది. అలాగే కోర్టుకు సమ్పరించిన ఆధారాలన్నింటిని కూడా సీబీఐకి తిరిగి అప్పగించింది. ఇక అవినాష్ రెడ్డి తదుపరి సీబీఐ విచారణపై స్టే ఇవ్వలేమని చెప్పిన కోర్టు..అతడిని సీబీఐ విచారించుకోవచ్చని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అవినాష్ (Mp Avinash Reddy) విచారణ సమయంలో మాత్రం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా అవినాష్ రెడ్డి విచారణ ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని కోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) కి షాక్ తగిలినట్లైంది.

ఇక తాజాగా మరోసారి అవినాష్ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 4 సార్లు అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి మరి.

First published:

Tags: Andhrapradesh, Ap, Telangana, YS Avinash Reddy, Ys viveka murder case

ఉత్తమ కథలు