Home /News /telangana /

MP ARVIND FIRES CM KCR DECISION ON NEW YEAR CELEBRATION VRY

MP Arvind : కాసులు నాకు.. కేసులు మీకు.. ఇదే కేసీఆర్ వైఖరి.. ఎంపీ అర్వింద్..

mp arvind on kcr

mp arvind on kcr

MP Arvind : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అర్ధరాత్రి వరకూ ప్రభుత్వం అనుమతులు జారీ చేయడంపై తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు.

    న్యూ ఇయర్ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. న్యూఇయర్ వేడుకల పేరుతో గుంపులుగా గుమిగూడి పీకల దాకా తాగండి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ఆస్తులమ్మి జరిమానాలు కట్టండి అన్నట్లు కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు. వేడుకల ద్వారా వచ్చే కాసులు నాకు.. కోవిడ్, ట్రాఫిక్ కేసులు మీకు అన్నట్లు తయారయ్యారని విమర్శలు చేశారు. సీఎంని కల్లుకుంట్ల రావు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

    కాగా మంగళవారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 31st డిశంబర్ ఉత్సవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
    ఆ రోజు పార్టీలకు అర్థరాత్రి వరకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని బార్లు,వైన్స్‌లు అర్ధరాత్రి వరకు కొనసాగే విధంగా నిర్ణయం తీసుకుంది. మద్యం షాపులతో సహా,నగరంలో నిర్వహించే ఈవెంట్లకు కూడా అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.

    Nalgonada : ముందుగా ప్రభుత్వ ఉద్యోగి.. ఆ తర్వాత 6గురు స్నేహితులు.. యువతిపై లైంగిక దాడి. ఫలితంగా..!

    మరోవైపు డిసెంబర్‌ 31 వ తేదీన వైన్స్‌ రాత్రి 12 గంటలకు ఓపెన్‌ ఉన్నప్పటికీ.. డ్రంకన్‌ డ్రైవ్‌ ఉంటుందని పేర్కొంది. దీంతో అర్థరాత్రి వరకు వైన్స్‌ ఒపెన్‌ ఉంటాయని కేసీఆర్‌ సర్కార్‌ ప్రకటన చేయడంతో.. మందు బాబులు సంబరాలు స్వేచ్చగా సంబరాలు చేసుకునే అవకాశం కల్పించినట్టయింది.. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి హైకోర్టు ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో క్రిస్మస్ వేడుకలు ముగిసిన తర్వాత జనవరి 2 వ తేదీ వరకు కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది..

    BJP vs TRS : లేఖ వివాదం.. వాళ్లంతా సీఎం కేసీఆర్ చెంచాగాళ్లు..

    అయితే ఈ నూతన సంవత్సర వేడుకలను రద్దు చేయాలంటూ హైకోర్టులో నేడు పిటిషన్‌ పడింది. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలపై హైకోర్ట్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కోంటూ.. ఓ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించాడు.. ఒమిక్రాన్ వ్యాప్తి జరుగుతున్ననేపథ్యంలో... ఇతర రాష్ట్రల వలే.. ఆంక్షలు పెట్టాలని హై కోర్ట్ ఆదేశించినా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.. పిటిషన్‌పై రేపు విచారణ జరపనున్నట్టు కోర్టు తెలిపింది.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Dharmapuri aravind, New Year 2022, Nizamabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు