హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad kitex : తెలంగాణలో కిటెక్స్.. ఎంఓయూ .. 40 వేల మందికి ఉపాధి..

Hyderabad kitex : తెలంగాణలో కిటెక్స్.. ఎంఓయూ .. 40 వేల మందికి ఉపాధి..

Hyderabad kitex

Hyderabad kitex

Hyderabad kitex : ప్రముఖ గార్మెట్స్ సంస్థ కిటెక్స్‌తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. గతంలో జరిగిన చర్చల మేరకు నేడు ఆ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. కాగా వరంగల్‌తో పాటు రంగారెడ్డిలోని సీతారాంపురంలో అప్పరల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనుంది.

ఇంకా చదవండి ...

  కిటెక్స్ గ్రూప్ మరియు తెలంగాణ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. వరంగల్‌లోని  కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, రంగారెడ్డి లోని సీతారాంపురంలో  ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పరాల్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన సంస్థ ప్రతినిధులు నేడు   ప్రభుత్వంతో అవగాహన ఒప్పంద పత్రాల కుదుర్చుకున్నారు. కాగా ఈ కార్యక్రమానికి కంపనీ నుండి ఆ సంస్థ చైర్మన్ పాల్గొనగా తెలంగాణ నుండి మంత్రులు కేటీఆర్, దయాకర్ ‌రావులతోపాటు సబితా ఇంద్రారెడ్డిలు పాల్గొన్నారు.

  ఈ సంధర్భంగా సంస్థ చైర్మన్ చైర్మన్ సాబు జాకబ్ మాట్లాడుతూ.. కేరళ (kerala)నుంచి తమ పెట్టుబడులు ఉపసంహరించుకున్న తర్వాత తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు రావడానికి ప్రధాన కారణం మంత్రి కేటీఆర్(ktr) అని అన్నారు. మంత్రి కేటీఆర్ గారి ని కలిసినప్పుడు ఏం కావాలని అడిగితే ఒక్కక్షణం ఆలస్యం చేయకుండా.. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కావాలని అడిగారని అన్నారు.. ఆ మాటే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు తమని ముందుకు నడిపించిందని అన్నారు.ఇక ఇక్కడి పరిస్థితులు అధ్యయనం చేసిన తర్వాత తమ వెయ్యి కోట్ల రూపాయల ప్రాథమిక పెట్టుబడిని ముందుగా పెట్టాలని నిర్ణయించామని .. దీన్ని మరింత విస్తరించి  2400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. తమ కంపనీ పెట్టుబడితో ప్రత్యక్షంగా 22000, పరోక్షంగా మరో 18000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఇక్కడి నుంచి 3 మిలియన్ల వస్త్రాలను అమెరికాకి ఎగుమతి చేస్తామని ఆయన ఈ సంధర్భంగా చెప్పారు..

  ఇది చదవండి :  డ్రగ్స్‌పై నేను ఏ టెస్టుకైనా సిద్దం.. రాహుల్ గాంధీ శాంపిల్స్ ఇస్తాడా.. ?


  కార్యక్రమంలోనే పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. కేరళ ప్రైవేట్ రంగంలో(private sector) అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీ, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కిడ్స్ అప్పరల్ మాన్యుఫాక్చరింగ్  కంపెనీగా ఉన్న (kitex) గ్రూప్ ను తెలంగాణకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. వరంగల్, రంగారెడ్డి లలో (warangal) కంపెనీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను, తమ ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వం తరఫున అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ కంపెనీల స్థాపన పూర్తయిన తర్వాత సుమారు మూడు లక్షల ఎకరాల్లోని తెలంగాణ కాటన్ ను కంపెనీ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. దీంతో రైతులకు మేలు చేయడంతో పాటు కంపెనీ ఉద్యోగాల కల్పనలో స్థానికులకు అధికంగా అవకాశాలు వచ్చేలా, వారికి అవసరమైన శిక్షణ కార్యకలాపాలను ప్రభుత్వం తరఫున చేపడతామని చెప్పారు... ఈ విషయంలో స్థానిక మహిళా సంఘాలతో సమన్వయం చేసుకొని వారికి శిక్షణ కార్యక్రమాలను అందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆయన సూచించారు.

  ఇది చదవండి : అక్కడ ప్రతిరోజు పండగే.. 100 కోట్ల మద్యం జాతర.. కారణం ఇదే..!


  వరంగల్ జిల్లా గీసుకొండ‌-సంగెం శివారు మరియు రంగారెడ్డి సీతారాంపూర్ ల‌లో దుస్తులు తయారీ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయడానికి కైటెక్స్ (KITEX) కంపెనీ ముందుకు రావ‌డం సంతోషమని మంత్రి దయాకర్ రావు అన్నారు. కైటెక్స్ కంపెనీ యాజ‌మాన్యానికి, ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. .

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Hyderabad, KTR

  ఉత్తమ కథలు