Home /News /telangana /

MOTHER WAS KILLED BY HER SON FOR MOBILE VRY

Gadwala : ఫోన్‌ కొనివ్వలేదని తల్లిని రోకలిబండతో బాదిన కొడుకు.. తలపగిలి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gadwala : మానసిక స్థితి సరిగా లేని ఓ కొడుకు చేసిన పనికి కన్న తల్లి ప్రాణాలు కోల్పోయింది. సెల్‌ఫోన్ కొనివ్వలేదని తల్లిని రాయితో కొట్టడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

    ఓ నిరుపేద కుటుంబంలో మొబైల్ ఫోన్ దారుణం చేసింది.. తనకు ఫోన్ కొనివ్వాలని గొడవ చేస్తున్న కొడుకు కోరిక తల్లి ప్రాణాన్ని బలిగొంది.. భర్త ఆరోగ్యం సహకరించకపోవడంతో భార్య కుటుంబ భారాన్ని మోస్తోంది. దీంతో రోజువారి కూలికి వెళుతుంది. అయితే అప్పటికే ఇంట్లో మతిస్థిమితం సరిగా లేని కొడుకు కూడా తోడు కావడంతో ఆ కాస్త రోజు కూలి కూడ వద్దనుకుని ఇంటివద్దే కొడుకును చూసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. అయితే ఇప్పుడు ఆ కన్న కొడుకే సెల్ ఫోన్ కోసం ఆమె ప్రాణం తీశాడు..

    గద్వాల జోగులాంబ జిల్లా ఉండవల్లి మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి 52 వెంకటేశ్వర్లు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు మహెశ్ ఇంటర్ వరకు చదివి తాను సైతం రోజు వారి కూలి పనులకు వెళుతున్నాడు. అయితే ఇటివల యువత అంతా సెల్ ఫోన్ మోజులో పడుతున్న తరుణంలో తనకు ఓ స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని తల్లి అడిగాడు మహెశ్.. అయితే వేల రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొనివ్వలేని తల్లి మందలిస్తూ వస్తుంది. దీంతో తన ఫోన్ కోసం మరోసారి తల్లితో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే ఆవేశంతో ఇంట్లోని రోకలి బండతో తల్లి తలపై బలంగా కొట్టడడంతో ఆమె తీవ్ర గాయాలపాలై కింద పడిపోయింది. అక్కడిక్కడే సృహ తప్పి పోవడంతో చికిత్స కోసం 108కి కాల్ చేశారు.. కాని అప్పటికే ఆమె మృతి చెందినట్టు ధృవీకరించారు.

    TSRTC : బస్‌పాస్ ప్రయాణికులకు షాక్.. పెరిగిన చార్జీలు.. ఎప్పటి నుండి అంటే...

    కాగా మహెశ్‌ ఇటివల మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. మూడు రోజుల క్రితం మిరప చెత్తను తగులబెడుతుండగా అందులో దూకినట్టు చెబుతున్నారు. దీంతో చేతులకు తీవ్రగాయాలు అయ్యాయి. అయితే గాయాలకు చికిత్స అందించేందుకే తల్లి లక్ష్మి కూలీకి వెళ్లకుండా మహేశ్‌కు సేవలు చేస్తున్న క్రమంలో దాడి చేసి చంపడం చర్చనీయాంశంగా మారింది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Gadwal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు