Murder : భర్త, కదలకుండా చేతులు పట్టుకుంటే...కొడుకు గొడ్డలితో నరికాడు...!

Murder : భర్త, కదలకుండా చేతులు పట్టుకుంటే...కొడుకు గొడ్డలితో నరికాడు...!

Nalgonda Murder : ఆస్తి కోసం ఓ కొడుకు తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. ఆ కొడుకుకు తండ్రి కూడా సహకరించిన ఘటన నల్గోండ జిల్లాలో చోటు చేసుకుంది..కూతురుకు ఆస్తిని ఇస్తుందన్న నేపంతో ఇంటికి వచ్చిన తల్లిని దారుణంగా చంపడం జిల్లాలో సంచలనంగా మారింది.

  • Share this:
ఆస్తి కోసం ఓ కొడుకు తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. ఆ కొడుకుకు తండ్రి కూడా సహకరించిన ఘటన నల్గోండ జిల్లాలో చోటు చేసుకుంది..కూతురుకు ఆస్తిని ఇస్తుందన్న నేపంతో ఇంటికి వచ్చిన తల్లిని దారుణంగా చంపడం జిల్లాలో సంచలనంగా మారింది.

ఆస్తి తగాదాలు కుటుంబాలను చిన్నభిన్నం చేస్తున్నాయి. సామరస్యంగా చర్చించుకుని పరిష్కరించుకునే సమస్యలను ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.ఇలా ఆస్తి తగదాల్లో కుటుంబాలే సర్వనాశనం అవుతున్నాయి. అయినా.. సామాజికంగా ప్రజల్లో ఎలాంటీ మార్పు రావడం లేదు..దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని ప్రాణాలు కొల్పోతున్నారు..

తాజాగా ఆస్తి తగదా ఓ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసింది.. నల్లగొండ జిల్లా నల్లగొండ మండలానికి చెందిన గంగమ్మ,యాదయ్యలు భార్యభర్తలు, వారికి ముగ్గురు కుమార్తెలు ,కొడుకు యాదగిరికి పెళ్లి అయి విడాకులు కూడా అయింది. తన కొడుక్కి తమ్ముడి కూతురునే చేసుకుంది గంగమ్మ..కాని యాదగిరి ప్రవర్తన సరిగా లేకపోవడంతో అయిదు సంవత్సరాల క్రితమే విడాకులు తీసుకున్నారు. దీంతో జల్సాగా తిరగడంతో అప్పులు అయ్యాయి. ఇలా అప్పులు కావడంతో తన కుటుంబానికి ఉన్న ఐదేకరాల పొలంతోపాటు ఇతర చోట్ల ప్లాట్లను అమ్మి అప్పులు తీర్చడంతో పాటు మరోపెళ్లి చేసుకుంటానని యాదగిరి తల్లిదండ్రులకు చెప్పాడు...అయితే ఇందుకోసం తండ్రి ఒప్పుకున్నా..తల్లి గంగమ్మ మాత్రం ఒప్పుకోలేదు. మరోవైపు అదనంగా ఎకరం పోలంతో పాటు మరో ప్లాటును తన పెద్ద కూతురు పేరుమీద గంగమ్మ రిజిస్టర్ చేసింది.

ఈ ఆస్తి వివాదల నేపథ్యంలోనే గంగమ్మ తన పెద్ద కూతురు వద్ద ఉంటుంది. ఈ క్రమంలోలోనే ఆస్తి పంపకాల గురించి పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో విషయం పోలీసు స్టేషన్‌కు చేరింది..అక్కడ గంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది..దీంతో తండ్రి, కొడుకులు గంగమ్మపై కక్ష పెంచుకున్నారు. ఇదంతా జరుగుతున్న సంధర్భంలోనే గంగమ్మ తన కూతురు ఇంటి నుండి తన ఇంటికి చేరుకుంది.

ఆమెను చూసిన తండ్రి, కొడుకులు ఆగ్రహంతో ఊగిపోయారు. తల్లి గంగమ్మతో యాదగిరి వాగ్వావాదానికి దిగాడు..ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో అవేశంతో ఊగిపోయిన కొడుకు యాదగిరి తల్లిని గొడ్డలితో నరికేందుకు ప్రయత్నం చేశాడు..ఇందుకోసం తండ్రి కూడా సహకరించాడు..యాదయ్య భార్యచేతులు గట్టిగా పట్టుకోవడంతో ఒక్కసారిగా ఆమెపై గొడ్డలితో వేటువేశాడు యాదగిరి ..గొడ్డలివేటుకు ప్రాణాలు వదిలిన గంగమ్మ ఒక్కసారిగా కుప్పకూలింది....ఆమె చనిపోవడంతో తండ్రికొడుకులు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by:yveerash yveerash
First published: