Peddapally : మందుల ఖర్చు భరించలేక.. కన్న కొడుకుపై దారుణానికి దిగిన తల్లి...!

Peddapally : మందుల ఖర్చు భరించలేక.. కన్న కొడుకుపై దారుణానికి దిగిన తల్లి...!

Peddapally : కొడుకు పుట్టినప్పటి నుండి కష్టాలే..మానసిక స్థితి సరిగా లేకపోవడంతోపాటు ..అందుకోసం ఖర్చు పెట్టే స్థోమత లేక.. తన కన్న కొడుకునే తల్లి కడతేర్చింది.. పద్నాలుగు సంవత్సరాలుగా భరించలేని సేవ చేసిన తల్లి..ఇక ముందు తనను పోషించలేనంటూ ప్రాణాలతోనే బావిలో నెట్టివేసింది.

  • Share this:
    తల్లిదండ్రుల కష్టాలు ఓ మానసిక రోగి ప్రాణాలను బలిగొన్నాయి..జీవితకాలం భరించలేని రోగంతో ఇబ్బంది పడుతున్న స్వంత కొడుకును ఆ తల్లి వద్దనుకుంది..ఎన్ని కష్టాలు ఎదురైనా తన పిల్లలను పోషించాలనుకునే తల్లిప్రేమ పై ఆర్ధిక భారం పై చేయి సాధించింది.. అందుకే బాధను దిగమింగుకుని తన కొడుకునే చంపి హంతకురాలైంది.

    వివరాల్లోకి వెళితే...పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మొగల్‌పురకు చెందిన సంకెండ్ల శేఖర్ , శ్యామలల రెండో సంతానం యశ్వంత్..పుట్టినప్పటి నుండి మానసిక సరిగా ఉండదు..ఇందుకోసం ప్రతినెల అందుకోసం మందులను వాడాల్సిందేనని డాక్టర్లు సూచించారు.. దీంతో అప్పటి నుండే వారికి కష్టాలు మొదలయ్యాయి..చేసేది కూలి పని మందుల కోసం వేలాది రూపాయలు తెచ్చిపెట్టలేని దయనీయ స్థితిలో ఆ కుటుంబం నెట్టుకువస్తుంది..ఇద్దరు తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

    అయినా కొడుకు పుట్టినప్పటి నుండి పద్నాలుగు సంవత్సరాల పాటు ఎదో విధంగా పోషిస్తున్నారు.. కాని, యశ్వంత్ పరిస్థితి రోజురోజుకు క్షిణించి పోతుంది..దీంతో మరింత ఆర్ధిక భారం మీదపడుతోంది.ఇక భవిష్యత్‌లో కొడుకును భరించలేని స్థితిలో తల్లిదండ్రులు మారిపోయారు. దీంతో కన్న పేగునే తెచ్చివేయాలని తల్లి నిర్ణయించుకుంది. అదను చూసి కొడుకును కడతేర్చాలని నిర్ణయించింది.రోజులాగే మంగళవారం కూలిపనులకు వెళ్లిన తల్లి శ్యామల కొడుకును కూడ తన వెంట తీసుకువెళ్లింది. అయితే ఆ విషయం భర్తకు తెలియకుండా చూసుకుంది..

    కూలికి పోయె దారిలో ఎవరు చూడకుండా.. ఓ పాడబడ్డ వ్యవసాయభావిలో యశ్వంత్‌ను నెట్టివేసింది. అనంతరం తన పనికి తాను వెళ్లిపోయింది..అయితే ఆ తల్లి గుండే ఆగలేకపోయింది..కనిపించకుండా చేసిన తల్లి హృదయం తల్లడిల్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి తన భర్తకు విషయం చెప్పింది. అనంతరం భర్త ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశాడు.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని జేసిబి సహాయంతో బయటకు తీశారు. పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి , సీఐ ప్రదీప్ కుమార్ , ఎస్ఎ రాజేశ్‌లు స్థలాన్ని పరీశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కొడును హత్య చేసినందుకు చట్టప్రకారం ఆమెపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకొని శ్యామల ను రిమాండ్ కు పంపినట్లు సీఐ తెలియజేశారు.అనంతరం ఆమెను రిమాండ్‌కు పంపినట్టు వెల్లడించారు.
    Published by:yveerash yveerash
    First published: