హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalogonda : కళ్లు లేని కొడుకుపై తల్లి దారుణం.. అల్లరి చేస్తున్నాడని కన్న పేగునే..!

Nalogonda : కళ్లు లేని కొడుకుపై తల్లి దారుణం.. అల్లరి చేస్తున్నాడని కన్న పేగునే..!

Nalogonda : ముగ్గురి కొడుకుల్లో ఒకరు లేకపోతే ఏంటని అనుకుందో ఏమో లేక తాను కన్నతల్లిని అనే విచక్షణ కోల్పోయిందో ఏమో గాని అంధుడైన తన కొడుకును ఓ తల్లి తానే కాలువలోకి నెట్టేసి ప్రాణాలు తీసింది.

Nalogonda : ముగ్గురి కొడుకుల్లో ఒకరు లేకపోతే ఏంటని అనుకుందో ఏమో లేక తాను కన్నతల్లిని అనే విచక్షణ కోల్పోయిందో ఏమో గాని అంధుడైన తన కొడుకును ఓ తల్లి తానే కాలువలోకి నెట్టేసి ప్రాణాలు తీసింది.

Nalogonda : ముగ్గురి కొడుకుల్లో ఒకరు లేకపోతే ఏంటని అనుకుందో ఏమో లేక తాను కన్నతల్లిని అనే విచక్షణ కోల్పోయిందో ఏమో గాని అంధుడైన తన కొడుకును ఓ తల్లి తానే కాలువలోకి నెట్టేసి ప్రాణాలు తీసింది.

  కట్టుకున్న భర్త ఎనిమిది సంవత్సరాల క్రితమే చనిపోయాడు. ముగ్గురు పిల్లలు నా అనే వారు ఎవరు లేరు.. దీనికి తోడు ముగ్గురిలో ఒకరు పుట్టుకతోనే అంధుడు.. అది చాలదన్నట్టు స్కూళ్లో రోజు అల్లరి చేస్తుండడంతో ఓ తల్లి తన పేగు బంధాన్ని మరిచిపోయింది. ఆ అల్లరి చేసే కొడుకును నిర్దాక్షిణ్యంగా కడతేర్చే ప్రయత్నం చేసింది. ఇందుకోసం కళ్లు కనిపించని తన కొడుకును తన చేతులతోనే ఓ కాలువలో నెట్టివేసి వెళ్లిపోయింది. అయితే అక్కడ ఉన్న కొంతమంది ఆమెను చూడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లేదంటే ఆ కళ్లు లేని కొడుకు జాడ తల్లికి తప్ప ఇంకేవరికి తెలిసేది. కాగా కాలువ నెట్టివేసిన బాలుడి ఆచూకి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

  వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన నల్లగంతుల సోములు, శైలజ దంపతులకు ముగ్గురు సంతానం. ఎనిమిదేళ్ల క్రితం భర్త సోములు చనిపోవడంతో శైలజ కొంతకాలంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్‌నగర్‌ కాలనీలో ముగ్గురు కుమారులైన రాజు, గోపీచంద్‌ (14), యోగేశ్‌లతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. అక్కడే పలువురి ఇళ్లల్లో పనిచేస్తూ కుమారులను పోషిస్తోంది. మొదటి కుమారుడు రాజు నల్లగొండలో ఇంటర్‌ మొదటి సంవత్సరం, మూడో కుమారుడు యోగేశ్‌ 4వ తరగతి చదువుతున్నారు.

  కాగా రెండో కొడుకు గోపీచంద్‌ పుట్టుకతో అంధుడు కావడంతో నల్లగొండ పట్టణంలోని బధిరుల పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం గోపిచంద్, నాలుగో తరగతి చదువుతున్నాడు.అయితే... గోపీచంద్‌ వయస్సు పెరుగుతున్నకొద్దీ మానసిక స్థితిని కోల్పొతుండడంతో స్కూళ్లో అల్లరి భరించలేని విధంగా తాయరైంది..దీంతో తోటి విద్యార్థులను గాయపరుస్తుండటంతో స్కూలు టీచర్స్ ఈ విద్యా సంవత్సరం బాలుడిని చేర్పించుకునేందుకు ఇష్టపడలేదు.

  CV Anand : డ్రగ్స్‌పై రూటు మార్చిన పోలీసులు.. వినియోగదారుల అరెస్ట్..!

  దీంతో నెగిటివ్ ఆలోచనలోకి వెళ్లిన గోపిచంద్ తల్లి దారుణ నిర్ణయం తీసుకుంది. కన్న కొడుకు అని కూడా ఆలోచించలేదు.. మానసికంగా ఇబ్బంది పడుతున్న కొడుకును సరైన ట్రీట్‌మెంట్ ఇప్పించలేక సతమతమయింది. దీనికి తోడు కళ్లు లేని కొడుకు జీవితం భవిష్యత్‌ను కూడా ఊహించలేకపోయింది. దీంతో కొడుకు ఏదో విధంగా వదిలించుకోవడమే పరిష్కారమనే ఆలోచనకు వెళ్లింది.

  RTC MD Sajjanar : శివరాత్రి పర్వదినాన మరోసారి ఆర్టీసీ స్పెషల్ ఆఫర్..

  ఈ క్రమంలోనే కొడుకును తీసుకొని శనివారం నల్లగొండ నుంచి బస్సులో బయలుదేరి, వేములపల్లి మండల కేంద్రానికి చేరుకుంది. అక్కడ నుంచి సాగర్‌ ఎడమ కాల్వ వంతెన సమీపంలో కుమారుడు గోపీచంద్‌ను నీటిలోకి తోసేసింది. అయితే కాల్వలో ఈత కొడుతున్న ఇద్దరు యువకులు ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహటిన అక్కడికి చేరుకున్న పోలీసులు గోపిచంద్ తల్లి శైలజను అదుపులోకి తీసుకున్నారు. కాగా సాగర్ కాలువలో బాలుడి ఆచూకి కోసం గాలిస్తున్నారు.

  First published:

  Tags: Mother, Nalgonda

  ఉత్తమ కథలు