హోమ్ /వార్తలు /తెలంగాణ /

Gummadidala: తల్లిని మించిన యోధురాలు లేదు.. కానీ ఈసారి అమ్మ గెలవలేదు: సంగారెడ్డిలో విషాదం

Gummadidala: తల్లిని మించిన యోధురాలు లేదు.. కానీ ఈసారి అమ్మ గెలవలేదు: సంగారెడ్డిలో విషాదం

తల్లి లక్ష్మి, కొడుకు బాలు (పాత ఫొటోలు)

తల్లి లక్ష్మి, కొడుకు బాలు (పాత ఫొటోలు)

నీళ్లలో మునిగిపోతోన్న కొడుకును కాపాడాలనే సంకల్పంతో కుంటలోకి దూకేసింది. బిడ్డ ప్రాణాలకు అడ్డం పడదామనే ఆత్రుతలో తనకూ ఈత రాదనే విషయాన్నే మర్చిపోయిందా తల్లి. చివరికి ఇద్దరూ చనిపోయారు..

  (K.Veeranna,News18,Medak)

  ‘ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవరూ లేరు’ అని కేజీఎఫ్ కోసం హీరో యష్ స్వయంగా రాసి, చెప్పిన మాట అక్షర సత్యమని మనందరి జీవితాల్లో నిత్యం రుజువవుతూనే ఉంటుంది. బిడ్డల కోసం తల్లులు ఎంతలా ఆరాటపడతారో, పిల్లలకు ఆపదొస్తే శక్తికి మించి పోరాడుతారు కూడా. ఈ ఘటనలోనూ ఓ తల్లి అలాంటి పోరాటమే చేసింది. నీళ్లలో మునిగిపోతోన్న కొడుకును కాపాడాలనే సంకల్పంతో కుంటలోకి దూకేసింది. బిడ్డ ప్రాణాలకు అడ్డం పడదామనే ఆత్రుతలో తనకూ ఈత రాదనే విషయాన్నే మర్చిపోయిందా తల్లి. చివరికి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సంగారెడ్డి జిల్లాలో చోటుచేసకుందీ విషాదకర సంఘటన. స్థానిక ఎస్సై విజయకృష్ణ, గ్రామస్తులు చెప్పిన వివరాలివి..

  సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన తలారి బాలు(12) ఐదో తరగతి పూర్తి చేశాడు. బడులకు ఎండాకాలం సెలవులు కావడంతో ఇంటిపట్టునే ఉంటూ పనుల్లో తల్లికి సాయం చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం తల్లి తలారి లక్ష్మి(32) తో కలిసి పశువుల్ని మేపడానికి వెళ్లాడా బాలుడు. గ్రామ సమీపంలోన బురుగు కుంట (చెరువు కంటే చిన్నది) వద్దకు పశువుల్ని తీసుకెళ్లారు.

  Prashant Kishor | Congress: సారీ మేడం.. నేను కాంగ్రెస్‌లో చేరట్లేదు: సోనియాకు భారీ షాకిచ్చిన పీకే  బర్రెలు మేత మేస్తుండగా పిల్లాడు వాడిపక్కనే ఉన్నాడు. తల్లి లక్ష్మి కాసేపలా కట్టమీదికి వెళ్లింది. అప్పటిదాకా మేసిన బర్లు.. ఒక్కొక్కటిగా కుంటలోని నీటిలో స్నానానికి దిగాయి. బాలుడు బాలు కూడా వాటిని అనుసరిస్తూ లోనికెళ్లాడు. అయితే గతంలో పూడికలు తీయడంతో ఆ కుంటలో పెద్ద గుంటలున్నాయి. ఈత తెలీని బాలు గుంటలో పడి ఊపిరాడక చేతులు ఆడించాడు. ఆ దృశ్యాన్ని చూసి షాకైన తల్లి లక్ష్మి.. ఒక్క పరుగున కట్టమీద నుంచి పరుగెత్తుకొని వచ్చి అమాంతం నీళ్లలోకి దూకింది.

  PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు.. మళ్లీ ఆ ఆప్షన్ అందుబాటులోకి..  కొడుకును కాపాడుకోడానికి విఫలయత్నం చేసిన తల్లి తనకూ ఈత రాక నీట మునిగింది. ఆ చోటుకు పక్కనే ఆటాడుకుంటోన్న చిన్నపిల్లలు కొందరు.. తల్లీకొడుకులు నీటమునగడం చూసి వెంటనే వెళ్లి గ్రామ పెద్దలకు చెప్పారు. సర్పంచి ఆంజనేయులు, ఉపసర్పంచి విజయకుమార్, ఎంపీటీసీ ప్రభాకర్రెడ్డి, స్థానికులు హుటాహుటిన గజ ఈతగాళ్లను వెంటేసుకుని కుంట దగ్గరికి వెళ్లి గాలించారు. సుమారు గంట వెతుకులాట తర్వాత తల్లీకొడుకుల మృతదేహాలు లభించాయి. మృతురాలి భర్త రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఎస్సై తెలిపారు.

  Published by:Madhu Kota
  First published:

  Tags: Mother, Sangareddy, Telangana

  ఉత్తమ కథలు