హోమ్ /వార్తలు /తెలంగాణ /

నువ్వు మాకొద్దు.. ఎక్కడైనా బతుకు.. 8 ఏళ్ల కొడుకిని రైలెక్కించి వెళ్లగొట్టిన తల్లి

నువ్వు మాకొద్దు.. ఎక్కడైనా బతుకు.. 8 ఏళ్ల కొడుకిని రైలెక్కించి వెళ్లగొట్టిన తల్లి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

8 ఏళ్ల పిల్లాడిని చూస్తే.. ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ కన్నతల్లే.. కర్కశకంగా అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టింది. రైలెక్కించి పంపించింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఈ బాలుడి వయసు ఎనిమిదేళ్లు. తండ్రి మరణించాడు. తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రెండో వివాహం చేసుకున్న తర్వాత తల్లి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ బాలుడిని పట్టించుకోవడమే మానేసింది. రెండో భర్తతో బిడ్డ పుట్టాక.. పరిస్థితులు మరింత మారాయి. తన మొదటి కొడుకును దూరం చేసుకోవాలనుకుంది. ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే..ఆ బాలుడిని ఓ రైలులో వదిలిపెట్టి.. వెళ్లిపోయింది. ఆ పిల్లాడిని చూస్తే.. ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ కన్నతల్లే.. కర్కశకంగా అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టింది. పోలీసులు (Hyderabad Police) చెప్పినా వినిపించుకోలేదు. నాకు అతడు వద్దని తెగేసి చెప్పింది. దిక్కుతోచని స్థితిలో పోలీసులు ఆ బాలుడిని.. చైల్డ్ లైన్‌ (Child Line) అప్పగించారు.

  Rajanna Sircilla: మంత్రి కేటీఆర్​ ఇలాకాలో దారుణ పరిస్థితులు.. స్థానికుల ఆగ్రహం

  చైల్డ్ లైన్ ప్రతినిధులతో మణికంఠ

  హైదరాబాద్‌ (Hyderabad)లోని రామంతాపూర్‌కు చెందిన అంబికకు మణికంఠ కుమారుడు ఉన్నాడు. భర్త చనిపోయాడు. ఆ తర్వాత అంబిక రెండో పెళ్లి చేసుకుంది. వీరికి పాప పుట్టింది. అప్పటి నుంచీ తన కుమారుడు మణికంఠను పట్టించుకోవడం మానేసింది. తాను చెప్పిన మాట వినడం లేన్న కారణంతో... అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టింది. మంగళవారం సాయంత్రం సికింద్రాబాద్ (Secunderabad) నుంచి భద్రాచలం (Bhadrachalam) వెళ్లే కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ రైలును ఎక్కించారు. ''ఎక్కడికైనా వెళ్లి బతుకు.. తిరిగి ఇంటికి రాకు..'' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేవలం ఎనిమిదేళ్ల వయసున్న అతడికి ఏం చేయాలో.. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. రైలులోనే ఏడుస్తూ.. అటూ ఇటూ తిరుగుతున్నాడు. బాలుడి పరిస్థితిని చూసి చలించిపోయిన తోటి ప్రయాణికులు.. స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఠాణాలో అప్పగించారు.

  పోలీసులు (Telangana Police) ఆ బాలుడితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అసలేం జరిగిందో.. అతడు పూసగుచ్చినట్లు వివరించాడు. అనంతరం పోలీసులు బాలుడి తల్లితో పాటు పినతండ్రిని పిలిపించి.. కౌన్సెలింగ్ ఇప్పించారు. కానీ వారు తమతో మణికంఠను తీసుకెళ్లేందుకు ఒప్పుకోలేదు. అతడు మా మాట వినడం లేదని... అలాంటప్పుడు మాకు అవసరం లేదని తేల్చిచెప్పారు. పోలీసులు ఎంత సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. వినలేదు. ఈ నేపథ్యంలో చివరకు ఆ బాలుడిని చైల్డ్ లైన్ ప్రతినిధులకు అప్పగించారు. ఇకపై అతడి ఆలనాపాలనను వారే చూసుకుంటారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Hyderabad, Secunderabad, Telangana

  ఉత్తమ కథలు