Home /News /telangana /

MOTHER DIED BEFOUR HER DAUGHTER MARRIAGE IN KAMAREDDY VRY NZB

Kamareddy : ఆ ఇంట్లో విషాదం.. కూతురు పెళ్లి ముందు ఆగిన తల్లి గుండె..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Kamareddy : కొద్ది రోజుల్లో కూతురు పెళ్లి జరిపించాల్సిన తల్లిదండ్రులు ప్రమాదం భారిన పడ్డారు.. అయితే ఆ ప్రమాదం కూతురు పెళ్లిపై ప్రభావం చూపుతుందని అందోళన చెందిన పెళ్లి కూతురు తల్లి గుండె ఆగిపోయింది. తల్లి ఆకాల మరణంతో పెళ్లింట విషాదం నెలకొంది.

ఇంకా చదవండి ...
    తమ పిల్లల పెళ్లిళ్లను ఘనంగా జరిపించాలని ప్రతి తల్లిదండ్రి భావిస్తారు. అంతా తామై ఏ లోటు రాకుండా పిల్లల పెళ్లిళ్లు జరపాలనే ఆత్రుత ఉంటుంది. తాము కన్న కళలు నిజమవుతానే సంతోషంతో అహర్నిషలు కృషి చేసి పెళ్లి పనుల్లో బిజీగా గడుపుతారు. అయితే అయితే ఇలా కళలు కన్న ఓ తల్లికి విషాదాన్ని మిగిల్చింది. అన్ని సజావుగా సాగి, పెళ్లి ముహుర్తం పెట్టుకున్న తర్వాత తల్లిదండ్రులకు ప్రమాదం జరిగింది. తన కూతురు పెళ్లిని ముందుండి నడిపించలేక పోతున్నానే ఆలోచనతో ఆమె గుండె ఆగిపోయింది.

    వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ‌ పట్టణంలోని పాత బాన్సువాడకు చెందిన గులేప‌ల్లి నిర్మ‌ల‌, కిషన్ దంపతులు.. వీరికి ముగ్గురు కూతుల్లు, ఒక కుమారుడు ఉన్నారు.. వీరిది వ్య‌వ‌సాయ కుటుంబం.. అయితే పెద్ద కూతురుకు వివాహం నిశ్చయమైంది.. మరో నెల రోజుల్లో పెళ్లి పెట్టుకున్నారు.. కాగా పెళ్లి పనులు అన్ని సవ్యంగా కొనసాగుతున్నాయి.. కాబోయో అల్లుడికి ఓ బైక్‌ కూడా కొనిచ్చారు.. అయితే నిర్మ‌ల‌, కిష‌న్ వారి పొలానికి వెళ్లి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో అడ్డుగా వచ్చిన బైక్ ఢీకొట్టింది.. దీంతో భార్యాభర్తలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.. స్థానికులు వెంటనే బాధితులని ఆసుపత్రికి తరలించారు..

    ఇది చదవండి : ఎల్బీనగర్‌లో యువతికి 18 కత్తిపోట్లు... విచక్షణ రహితంగా పొడిచిన ప్రియుడు..


    కాగా ఈ ప్రమాదంలో నిర్మల కాలు విరగడంతో వైద్యులు సిమెంట్ పట్టి కట్టారు.. అయితే ఆ తల్లి మాత్రం తన కూతురు పెళ్లిపై బెంగ పెట్టుకుంది. సిమెంట్ పట్టి కట్టడడంతో పెళ్లి పనుల్లో పాల్గొనలేక పోతున్నానే బెంగ ఆమెలో ఎక్కువైంది. దీంతో రోజు బాధపడుతూ రోజులు గడుపుతుంది. అయితే ఆలోచన ఆమె ప్రాణాల మీదకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.. కాని పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్రానికి పంపించారు.. కాని దురదృష్టవశాత్తు నిర్మల మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. కూతురు పెళ్లిపై ఆలోచన ఆమె ప్రాణాలను కోల్పోవం గ్రామంలో విషాదం నింపింది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Kamareddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు