Home /News /telangana /

MOTHER AND DAUGHTER COMMITTED SUICIDE BY JUMPING INTO TUNGABHADRA RIVER IN JOGULAMBA GADWAL DISTRICT SNR MBNR

Mystery : తంగభద్రనదిలో 4ఏళ్ల పాప శవం..ఘాట్ దగ్గర తల్లి వస్తువులు ..అసలేం జరిగిందంటే

joint suicide

joint suicide

Suicide : మూడ్రోజుల క్రితం నాలుగేళ్ల కూతుర్ని తీసుకొని ఆంధ్రా నుంచి వచ్చింది ఓ వివాహితురాలు. తర్వాత తెలంగాణలోని తుంగభద్రనది ఒడ్డున ఆమె సెల్‌ఫోన్, గోల్డ్ చైన్, బ్యాగును గుర్తించారు పోలీసులు. మధ్యలో ఏం జరిగిందంటే..

    (Syed Rafi, News18,Mahabubnagar)
    మూడ్రోజుల క్రితం నాలుగేళ్ల కూతుర్ని తీసుకొని ఇంటి నుంచి వెళ్లింది ఓ వివాహితురాలు. రాత్రైనా ఇంటికి చేరకపోవడంతో భర్త, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బంధువుల ఇంటికి వెళ్లిందేమోనని ఫోన్‌లు చేసి కనుగొన్నారు భర్త, అత్తమామలు. ఎక్కడికి రాలేదని సమాధానం రావడంతో పోలీస్ కంప్లైంట్(Police Complaint) ఇచ్చారు. మిస్సింగ్ కేసు(Missing case) నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ సెల్‌ఫోన్‌(Cell phone), బంగారు మంగళసూత్రాన్ని బ్యాగు(Bag)తో పాటు గుర్తించారు. ఇంటి నుంచి వెళ్లిన మహిళ వస్తువులు అక్కడ ఎందుకున్నాయని ఆరా తీస్తున్నారు పోలీసులు.

    Harassment : లేడీ టీచర్‌కి వాట్సాప్‌లో అగ్లీ ఫోటోలు, అసభ్యకరమైన మెసేజ్‌లు .. పంపింది ఎవరో కాదు ..!



    ఎంత కష్టం వచ్చిందో తల్లికి..
    ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా దేవమాడ గ్రామానికి చెందిన మమతారెడ్డి అనే 31సంవత్సరాల వివాహిత తన నాలుగేళ్ల వయసు కలిగిన జీవన అనే కూతుర్ని తీసుకొని ఆదివారం ఇంటి నుంచి బయటకు వచ్చింది. రాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె భర్త ప్రవీణ్ రెడ్డి, తల్లి నాగేశ్వరమ్మ సమీప బంధువులను ఆశ్రయించి ఆరా తీశారు. ఎక్కడ మమతరెడ్డి జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇంటి నుంచి బయటకు వచ్చిన రోజే మమతరెడ్డి జోగులంబ గద్వాల జిల్లా   అలంపూర్ మండల కేంద్రానికి చేరుకొని రాత్రి 7గంటలకు అలంపూర్‌లో నివాసముంటున్న తన సోదరి రమాదేవికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది.



    బిడ్డతో కలిసి ప్రాణాలు తీసుకుంది..
    ఆ తర్వాత ఫోన్‌ రింగ్ అవుతున్నప్పటికి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం కలిగి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో పోలీసులు ఆదిశగా దర్యాప్తు చేపట్టారు. అలంపూర్ మండల సమీపంలో తుంగభద్రనది సమీపంలో ఉన్న పుష్కర్ ఘాటుపై మమతరెడ్డి హ్యాండ్ బ్యాగుతో పాటు ఆమె మంగళసూత్రం, సెల్‌ఫోన్‌ ఉండటంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. తుంగభద్రనదిలో బిడ్డతో పాటు తల్లి మమతరెడ్డి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని గుర్తించారు. జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టడంతో చిన్నారి జీవన మృతదేహం లభ్యమైంది. మమతరెడ్డి మృతదేహం కోసం గాలిస్తున్నారు. బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటని పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఆమె సెల్‌ఫోన్‌ కాల్ లిస్ట్ చెక్ చేస్తున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Jogulamba gadwal, Telangana News, Women suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు