కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్..సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు

MOS home G kishan reddy | ఓ ఆగంతకుడి నుంచి ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్ వచ్చింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

news18-telugu
Updated: June 14, 2019, 10:03 AM IST
కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్..సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు
కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 14, 2019, 10:03 AM IST
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. గత నెల 20న ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్ వచ్చింది. హతమారుస్తామంటూ ఓ ఆగంతకుడు కిషన్ రెడ్డిని బెదిరించాడు. కిషన్ రెడ్డి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఇంటర్నెట్ వాయిస్ కాల్ వచ్చిందన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా కిషన్ రెడ్డికి ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి.

 

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...