Home /News /telangana /

MORE THAN A HUNDRED CORONA POSITIVE CASES HAVE BEEN REGISTERED IN THE JOINT MEDAK DISTRICT SNR MDK

Corona Fear : ఒక్కరోజులో వంద మందికి కరోనా వ్యాప్తి .. జిల్లా ప్రజల్ని వణికిస్తున్న వైరస్

(MEDAK CORONA)

(MEDAK CORONA)

Corona Fear: తెలంగాణలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. నిన్న, మొన్నటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకటి , రెండు కేసులకే పరిమితమయ్యాయి. తాజాగా ఈసంఖ్య వందకు చేరుకోవడం జిల్లా ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోంది.

(K.Veeranna,News18,Medak)
తెలంగాణ(Telangana)లో కరోనా((Corona) వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. నిన్న, మొన్నటి వరకు ఉమ్మడి మెదక్(joint Medak ) జిల్లాలో ఒకటి , రెండు కేసులకే పరిమితమయ్యాయి. తాజాగా ఈసంఖ్య వందకు చేరుకోవడం జిల్లా ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోంది. వైరస్ బారిన పడిన వాళ్లలో ఎక్కువగా స్టూడెంట్స్‌(Students) ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధికంగా సిద్ధిపేట(Siddipet)జిల్లాలో కేసులు నమోదవగా..మెదక్‌లో 10 కేసులు బయటపడ్డాయి.

Telangana | Ration : అగస్ట్ 4నుంచి రేషన్‌ కార్డుపై ఒక్కొక్కరికి 15కేజీల బియ్యం ఉచితం .. ఎన్ని నెలలు ఇస్తారంటే



మళ్లీ పంజా విసిరిన వైరస్..
ఉమ్మడి మెదక్ జిల్లాను కరోనా వైరస్ కేసులు భయపెడుతున్నాయి. సోమవారం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 79 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 48 మంది విద్యార్ధినులే ఉన్నారు. మరో ఇద్దరు ఉపాధ్యాయులు, ఇద్దరు గురుకుల పాఠశాల సిబ్బంది ఉన్నారు. మరో 27మంది సాధారణ ప్రజలకు పాజిటివ్‌గా నిర్ధారణైంది. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వంద కేసులు నమోదయ్యాయి. ఇందులో సిద్దిపేటలో 79, సంగారెడ్డి జిల్లాలో 11, మెదక్ జిల్లాలో 10 మందికి వైరస్ సోకింది.



కలవరపెడుతున్న కరోనా...
24గంటల క్రితం ఉమ్మడి మెదక్ జిల్లాలోని గురుకులాలు, నర్సింగ్ కాలేజీ కాకుండా జిల్లా వ్యాప్తంగా మొత్తం 361 మందికిపైగా కరోనా పరీక్షలను నిర్వహించగా 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మండలాల వారీగా సిద్దిపేట అర్బన్‌లో 14, హుస్నాబాద్‌లో 5, నంగునూరులో 3, గజ్వేల్లో 1, నమోదైంది. సిద్దిపేటలోని నర్సింగ్ కాలేజీలో 90 మంది విద్యార్థినులు ఉండగా అందరికీ టెస్టులు చేయడంతో 27 మందికి పాజిటివ్‌గా నిర్దారణైంది. ఇందులో ఆరుగురు తీవ్ర లక్షణాలతో బాధపడుతున్నారు.

Telangana | Cheddigang : బట్టలు వేసుకోకుండా వచ్చి భయపెడుతున్నారు .. రాత్రి పూట నిద్రపోని అక్కడి జనం



బాధితుల్లో స్టూడెంట్సే అధికం..
సిద్దిపేట పట్ణంలోని బాలికల మైనార్టీ గురుకులంలోనూ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పాఠశాలలోని వంద మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి వైరస్ సోకింది. హుస్నాబాద్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో రెండ్రోజుల నుంచి విద్యార్ధులు తీవ్రజ్వరంతో బాధపడుతున్నారు. హాస్టల్ సిబ్బంది వైరల్ ఫీవర్‌గా భావించారు. ఎంతకు తగ్గకపోవడంతో సోమవారం కరోనా పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. వెంటనే వైద్యులు పాఠశాలలకు వెళ్లి 215 మందికి పరీక్షలు చేయగా మొత్తం 20 మందిలో కరోనా లక్షణాలు గుర్తించారు. ఇందులో 16 మంది స్టూడెంట్స్‌, ఇద్దరు టీచర్స్, మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. విద్యార్థినులను పాఠశాలలోనే ఐసోలేషన్లో ఉంచి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. పాఠశాల, హాస్టల్ గదులను శానిటైజ్ చేయిస్తున్నారు.

ఒక్కరోజే వంద మందికి పాజిటివ్..
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 67 మందికి టెస్టులు చేశారు. సంగారెడ్డిలో 5, నారాయణఖేడ్లో 2, సదాశివపేట, జహీరాబాద్ లో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జోగిపేట గురుకులంలో 2 కేసులు నమోదయ్యాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా 176 మందికి ర్యాపిడ్ పరీక్షలు చేయగా తూప్రాన్ 4 మెదక్ 3, నర్సాపూర్ 3 చొప్పున కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూప్రాన్లో ప్రభుత్వ వైద్యుడికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కేసులు పెరుగుతున్న దృష్ట్య మంగళవారం నుంచి కరోనా టెస్టుల సంఖ్యను మరింత పెంచడానికి వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. అంతేగాకుండా ప్రభుత్వ ఆసుతులో కొవిడ్ వార్డుల ఏర్పాటు కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Medak District news, Telangana corona

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు