BJP Telangana: తెలంగాణలో బీజేపీ గూటికి చేరనున్న కీలక నేతలు వీరే..

BJP Telangana: రాబోయే రోజుల్లో టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టే విధంగా తమ పార్టీలో చేరికలు ఉంటాయని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఒకేసారి కాకుండా.. రాష్ట్రంలో ఎన్నికలు జరగబోయే అన్ని ప్రాంతాల్లోనూ పార్టీలో చేరికలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని బీజేపీ యోచిస్తోంది.

news18-telugu
Updated: December 6, 2020, 8:06 AM IST
BJP Telangana: తెలంగాణలో బీజేపీ గూటికి చేరనున్న కీలక నేతలు వీరే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గ్రేటర్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన అనంతరం నేతల చేరికపై దృష్టి పెట్టిన బీజేపీ నాయకత్వం.. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు సంబంధించిన బలమైన నేతలను తమ పార్టీలోకి చేర్చుకునే ప్రక్రియను ముమ్మరం చేస్తోంది. వచ్చే అసెంబ్లీల్లో గెలుపే లక్ష్యంగా కీలక నేతలను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్న బీజేపీ.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. నియోజకవర్గ స్థాయిలో బలమైన నాయకులతో పాటు చరిష్మా ఉన్న బలమైన నేతలను పార్టీలోకి తీసుకోవాలని యోచిస్తోంది. రేపు విజయశాంతిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఆమెతో పాటు కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్‌లో చేరనున్నట్టు సమాచారం.

ఇక నాగార్జున సాగర్ ఉఫ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్న కాషాయ దళం.. జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డితో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తాను పార్టీ మారుతున్నట్టు వార్తలపై స్పందించిన రఘువీర్ రెడ్డి.. దివంగత ఎమ్మెల్యే నోముల సంతాప దినాలు పూర్తయ్యేవరకు దీనిపై మాట్లాడటం సరికాదని అన్నారు. అయితే తాము పార్టీ మారడం లేదని ఆయన వ్యాఖ్యానించలేదు.

వీరితో పాటు వికారాబాద్‌కు చెందిన మాజీమంత్రి చంద్రశేఖర్, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలను బీజేపీ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని ఓ మాజీమంత్రి, ఓ మాజీ ఎంపీ సైతం బీజేపీ నేతలతో భేటీ అయ్యారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టే విధంగా తమ పార్టీలో చేరికలు ఉంటాయని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఒకేసారి కాకుండా.. రాష్ట్రంలో ఎన్నికలు జరగబోయే అన్ని ప్రాంతాల్లోనూ పార్టీలో చేరికలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. వరంగల్, ఖమ్మంతో పాటు రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు సందర్భంగా చేరికలు ఉండేలా చూడాలని భావిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: December 6, 2020, 7:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading