హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రజలకు ఊరట.. మంత్రి ఈటల కీలక ప్రకటన

Telangana: కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రజలకు ఊరట.. మంత్రి ఈటల కీలక ప్రకటన

తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్ ఉప ఎన్నిక మీదే ఉంది. ఈ స్థానానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ.. అక్కడ కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో అధికార టీఆర్ఎస్, బీజేపీలో చేరిన మాజీమంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు.

తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్ ఉప ఎన్నిక మీదే ఉంది. ఈ స్థానానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ.. అక్కడ కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో అధికార టీఆర్ఎస్, బీజేపీలో చేరిన మాజీమంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు.

Telangana: తెలంగాణలో ఆక్సిజన్‌ కొరత లేదని మంత్రి తెలిపారు. అన్ని జిల్లాలకు ఆక్సిజన్‌ను రవాణా చేస్తున్నామన్నారు.

  కరోనా కేసులు పెరుగుతుండటం.. అందులోనూ ఆక్సిజన్ కోసం ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువకావడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. కేసులు పెరిగినా.. అందుకు తగ్గట్టుగా రోగులకు సేవలు అందించేందుకు మరో వారం పది రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3010 ఆక్సిజన్‌ సరఫరాతో కూడిన బెడ్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయని వెల్లడించారు. తెలంగాణలో ఆక్సిజన్‌ కొరత లేదని మంత్రి తెలిపారు. అన్ని జిల్లాలకు ఆక్సిజన్‌ను రవాణా చేస్తున్నామన్నారు. ఆర్మీ విమానాల ద్వారా ఆక్సిజన్‌ తెచ్చుకున్నామని తెలిపారు.

  నాలుగు లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు గతంలోనే ఆర్డర్‌ ఇచ్చామని వ్యాఖ్యానించారు. ఆక్సిజన్‌ పర్యవేక్షణకు ఐఏఎస్‌ అధికారుల నియామకం చేపట్టినట్లు తెలిపారు. పీఎం కేర్‌ నుంచి 5 ఆక్సిజన్‌ మిషన్లు వచ్చాయన్నారు. ప్రస్తుతం రోజుకు 270 టన్నుల ఆక్సిజన్‌ అవసరమని అవుతుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రోజుకు 400 టన్నుల ఆక్సిజన్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

  కొత్తగా గాంధీ ఆస్పత్రిలో 400, గచ్చిబౌలి టిమ్స్‌లో 300, వరంగల్ ఎంజీఎంలో 300, నిమ్స్ ఆస్పత్రిలో 200, సూర్యాపేట ఎంసీహెచ్‌లో 200, నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో 200, మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో 200, సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రిలో 200, మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో 100, మలక్‌పేట ఆస్పత్రి, గోల్కోండ ఆస్పత్రి, వనస్థలిపురం ఆస్పత్రి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, అమీర్‌పేట్ ఆస్పత్రి, నాచారం ఆస్పత్రి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి, చెస్ట్ ఆస్పత్రి, ఎర్రగడ్డ ఆస్పత్రిలో అదనపు బెడ్లు ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Coronavirus, Etela rajender, Telangana

  ఉత్తమ కథలు