Home /News /telangana /

MORE 10 LAKH PENSIONS WILL BE GIVEN FROM AUGUST 15 TELANGANA CABINET DECISIONS HERE AK

Telangana Cabinet Decisions: కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు.. తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

Telangana Cabinet: ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని తీర్మానించింది. దీంతో మొత్తంగా కొత్తవి, పాతవి కలిపి 46 లక్షల పెన్షన్దారులకు కార్డులు మంజూరు చేయనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం (Telangana Cabinet Decisions) నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని తీర్మానించింది. దీంతో మొత్తంగా కొత్తవి, పాతవి కలిపి 46 లక్షల పెన్షన్దారులకు (Aasara Pensions) కార్డులు మంజూరు చేయనున్నారు. దీంతో పాటు స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. ఇక కోఠి ఈఎన్.టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది.

    కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన తలపెట్టిన శాసనసభ, మరియు స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు చేయాలని తీర్మానించింది.



    ఈనెల 21వ తేదీన పెళ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం వల్ల పెద్దఎత్తున వివాహాది శుభకార్యక్రమాలు ఉన్నందున ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక సమావేశాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని నిర్ణయం తీసుకుంది. జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.

    KCR| Amit Shah: మునుగోడులో టీఆర్ఎస్ బహిరంగ సభ.. అమిత్ షా కంటే ముందుగానే రంగంలోకి కేసీఆర్ ?

    Telangana EAMCET Results 2022: రేపే తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు.. ఈ లింక్ తో రిజల్ట్స్ చెక్ చేసుకోండి

    గ్రామకంఠంలో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులతో ఒక కమిటీ వేసి, 15 రోజుల్లోగా ఒక నివేదిక ఇచ్చి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాల ఎకరాల స్థలాన్ని కేటాయించింది. షాబాద్‌లో షాబాదు బండల పాలిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో స్థలాల కేటాయింపునకు 45 ఎకరాలను కేటాయిస్తూ తీర్మానం చేసింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Telangana

    తదుపరి వార్తలు