Home /News /telangana /

MOOD OF THE NATION POLL BIG JOLT TO TRS BJP WILL BAG SIX MP SEATS IN TELANGANA IS LOKSABHA ELECTIONS HELD TODAY SK

Telangana: కేసీఆర్‌కు షాక్.. తెలంగాణలో పుంజుకున్న బీజేపీ.. ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లు వస్తాయంటే..

బండి సంజయ్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

బండి సంజయ్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana Politics: తెలంగాణలో బీజేపీ క్రమంగా పుంజుకుంటున్నట్లు తేలింది. బీజేపీ బలపడడం.. కాంగ్రెస్​కు మాత్రమే కాదు..అధికార టీఆర్​ఎస్​కు కూడా గట్టి ఎదురు దెబ్బేనని సర్వే అంచనా వేసింది.

    తెలంగాణలో టీఆర్ఎస్‌ (Telangana Rastra Samithi)కు తిరుగులేదు. కారు జోరుకు ఎదురు లేదు. ఇది మొన్నటి మాట. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. గులాబీ పార్టీ తిరుగులేని శక్తగా ఎదుగుతున్న సమయంలో బీజేపీ (BJP) రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఉపఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ తప్ప మరో పార్టీ గెలవలేదన్న మాటను అందరూ చెప్పేవారు. కానీ దుబ్బాక ఉపఎన్నికల నుంచి సీన్ మారిపోయింది. దుబ్బాకలో టీఆర్ఎస్‌పై బీజేపీ విజయం సాధించింది. అంతేకాదు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ (GHMC Elections) గులాబీ దండు కమల దళం గట్టి షాకిచ్చింది. బీజేపీ ఏకంగా 48 స్థానాలను కైవసం చేసుకొని ఊహించని విధంగా కొట్టింది. ఇక గత ఏడాది జరిగిన హుజురాబాద్ ఉపఎన్నికల్లోనూ (Huzurabad Bypoll) బీజేపీయే గెలిచింది. దీనిబట్టి తెలంగాణలో బీజేపీ పార్టీ పుంజుకుంటోందని స్పష్టంగా అర్ధమవుతోంది. అంతేకాదు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో కూడా ఇదే విషయం స్పష్టమైంది.

    తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం..

    ఇండియా టుడే- సీ ఓటర్ సంస్థలు 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో (Mood Of The Nation poll 2022) పేరుతో సర్వే నిర్వహించాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ సర్వేలో తెలంగాణకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా పుంజుకుంటున్నట్లు తేలింది. బీజేపీ బలపడడం.. కాంగ్రెస్​కు మాత్రమే కాదు..అధికార టీఆర్​ఎస్​కు కూడా గట్టి ఎదురు దెబ్బేనని సర్వే అంచనా వేసింది. బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ పార్టీ రోజు రోజుకు బలోపేతమవుతోందని అభిప్రాయపడింది.

    Dalita Bhandu : మరో మూడు మండలాలకు దళిత బంధు.. సమీక్షించిన  మంత్రి

    ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. తెలంగాణలో బీజేపీ 6 ఎంపీ సీట్లు గెలుస్తుందని ఇండియాటుడే-సీఓటర్ సర్వే అంచనా వేసింది. టీఆర్ఎస్ 8 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. ఇక కాంగ్రెస్ 2 సీట్లు, ఎంఐఎం ఒక స్థానం కైవసం గెలుచుకుంటాయని సర్వే తెలిపింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే. బీజేపీ 2 సీట్లు అదనంగా గెలుస్తుందని సర్వే అభిప్రాయపడింది. టీఆర్​ఎస్​, కాంగ్రెస్​లు ఒక్కో సీటు కోల్పోయే అవకాశముందని వెల్లడించింది.

    Hyderabad : హైద‌రాబాద్ లో కొత్త వీకెండ్ గేట్ వే లు.... ఫామ్ హౌస్ స్టే ల‌కు మొగ్గు

    ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి కాస్త భిన్నగా ఉంది. అక్కడ ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే మళ్లీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సీ ఓటర్‌– ఇండియా టుడే సర్వే తేల్చింది. వైఎస్‌ జగన్‌కు ప్రజాదరణ ఏ మాత్రం కూడా తగ్గలేదని స్పష్టం చేసింది. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క సీటు కూడా రాదని తెలిపింది.

    Telangana Politics: రేవంత్ రెడ్డికి ఇప్పట్లో అలాంటి తలనొప్పులు లేనట్టేనా ?..

    దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని సర్వే అభిప్రాయపడింది. వరుసగా మూడోసారి కూడా ప్రజలు నరేంద్ర మోదీనే ప్రధానిగా కోరుకుంటున్నారని సీ ఓటర్‌– ఇండియా టుడే సంయుక్త సర్వే తేల్చింది. నేషనల్‌ డెమొక్రాటిక్‌ అలయన్స్‌ (NDA) సీట్ల సంఖ్య 350 నుంచి 296కు పడిపోతుందని అంచనా వేసింది. బీజేపీ సీట్ల సంఖ్య 303 నుంచి 271 సీట్లతో తగ్గుతుందని.. ఐనప్పటికీ సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితిలోనే ఉందని వెల్లడించింది. కొన్ని సీట్లు తగ్గినప్పటికీ.. మళ్లీ కాషాయ దళమే అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bandi sanjay, Bjp, CM KCR, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు