హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఏపీలో భారీ వర్షాలు.. రేపు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు..

ఏపీలో భారీ వర్షాలు.. రేపు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. కర్ణాటక, ఏపీ దాటుతూ తెలంగాణవైపు పయనిస్తున్నాయి.

    నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. కర్ణాటక, ఏపీ దాటుతూ తెలంగాణవైపు పయనిస్తున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నాటికి మహారాష్ట్ర, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో మంగళవారం రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు. బుధవారం నుంచి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తుండటంతో చాలాచోట్ల తొలకరి వర్షాలు కురుస్తాయని చెప్పారు.

    అటు.. రుతుపవనాల ప్రభావంతో ఏపీలో రానున్న రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సారి 47-56 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపటి నుంచి కోస్తా తీరంలో 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: AP News, Telangana News, WEATHER

    ఉత్తమ కథలు