పార్లమెంట్ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ.. ఎప్పటి నుంచంటే..

ప్రతీకాత్మక చిత్రం

వచ్చే నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం నోటిఫికేషన్ జారీచేసినట్లు లోక్‌సభ సెక్రటేరియెట్ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబరు 14 నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాలు అక్టోబర్‌ 1తో ముగియనున్నాయి.

  • Share this:
    వచ్చే నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం నోటిఫికేషన్ జారీచేసినట్లు లోక్‌సభ సెక్రటేరియెట్ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబరు 14 నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాలు అక్టోబర్‌ 1తో ముగియనున్నాయి. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కరోనా బారినపడకుండా అనేక ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 4 గంటల పాటు లోక్‌సభ, సాయంత్రం 4 గంటల పాటు రాజ్యసభ కార్యకలాపాలు నిర్వహించాలని ఇది వరకే నిర్ణయించారు. ఈసారి ప్రశ్నోత్తరాల సమయం ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేరుగా జీరో అవర్‌తోనే సమావేశాలను ప్రారంభించనున్నట్లు సమాచారం.


    ఉభయ సభలకు హాజరయ్యే ముందు ఎంపీలంతా విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం లోక్‌సభ, రాజ్యసభలో పలు చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షించారు. సభ్యులంతా భౌతిక దూరం పాటించేలా సీట్లను కేటాయించనున్నారు. ఉభయ సభల్లోనూ ఛాంబర్లు, గ్యాలరీలను కూడా సభ్యులకే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో 60 మంది సభ్యులు ఛాంబర్‌లో, మరో 51 మంది గ్యాలరీల్లో, మిగతా 132 మంది సభ్యులు లోక్‌సభలో కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు జరిగే తీరుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
    Published by:Shiva Kumar Addula
    First published: